క‌రోనా వైర‌స్‌(కొవిడ్-19) ముప్పుతో ఇప్ప‌టికే అన్ని క్రీడాటోర్నీలు ర‌ద్దు అయ్యాయి. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ఏప్రిల్ 15కు వాయిదా ప‌డ‌డంతో తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న టీమిండియా క్రికెట‌ర్ల‌కు కాస్త విరామం దొరికింది. క‌రోనా ధాటికి బ‌య‌టికి వెళ్ల‌లేని ప‌రిస్థితులు ఉండ‌డంతో ఎవ‌రి ఇళ్ల‌లో వారు కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. భార‌త ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా.. త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌కు
దిండు సవాల్‌(బ్లైండ్‌ పిల్లో ఫైట్‌) ను విసిరాడు.

Also Read: పీటర్సన్‌ను ట్రోల్ చేసిన యువీ

ముఖానికి ముసుగు వేసుకొని దిండులతో సరదాగా ఆడుకోవడాన్ని దిండు సవాల్‌ అంటారు. అయితే ఎవరు దిండుతో ఇతరులను ముందుగా తాకుతారో వారే గెలిచినట్లుగా భావిస్తారు. ధావన్‌ కూడా తన కుటుంబంతో సరదాగా ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ఇంట్లో కూర్చోవడం సరదాగా ఉండదని ఎవరు చెప్పారు? దాని కోసం మనం మార్గాలను వెతుక్కోవాలి. దిండు సవాలును మీరూ ప్రయత్నించండి’’ అని వీడియోకి కామెంట్ జ‌త చేసి హిట్‌మ్యాన్ రోహిత్‌శ‌ర్మ‌, హార్దిక్‌, కుల్‌దీప్‌, చాహల్‌ల‌ను ట్యాగ్ చేశాడు. ఇటీవ‌ల కాలంలో ఈ బ్లైండ్‌ పిల్లో ఫైట్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.