దివంగత సీఎం జయలలిత నెచ్చలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. శశికళ వచ్చే ఏడాది జైలు నుంచి విడుదల కానున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జైళ్ల శాఖకు శశికళ రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. తన గురించి సమాచారాన్ని ఎవ్వరికీ ఇవ్వొద్దని శశికళ జైళ్ల శాఖకు లేఖలో తెలిపినట్లు తెలుస్తోంది. శిక్ష కాలం ముగిసి జనవరిలో ఆమె విడుదల కానున్నట్లు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. శిక్షా కాలం ముగిసిన అనంతరం చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. రూ.10 కోట్ల జరిమానా ముందుగా చెల్లించాల్సి ఉంది. అందుకే ఆమె ప్రతినిధి, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ బెంగళూరులో తిష్ట వేశారు.

అయితే తన వివరాలను ఎవరు పడితే వారు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటుండటంతో శశికళ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన వివరాలు ఎవ్వరికీ ఇవ్వవద్దని ఆమె జైళ్లశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విడుదలయ్యే వ్యవహారం గురించి సమాచారం సేకరించిన వారు మున్ముందు తన విడుదలకు అడ్డు తగిలేలా కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకోవచ్చని, అందుకే చిన్నమ్మ లేఖ రాసినట్లు అమ్మ శిబిరంలో చర్చ జరుగుతోంది. జైలులో లగ్జరీగా ఉన్నారన్న విషయం ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆ దిశగా సమాచారం సేకరించే వారు ఉండవచ్చనే ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శశికళ సోదరుడికి వారెంట్‌
శశికళ కుటుంబ సభ్యులు, బంధువుల మీద అనేక ఆరోపణలున్నాయి. అలాగే కేసులు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శశికళ సోదరుడు సుందరవదన్‌కు తంజావూరు కోర్టు పీటీ వారెంట్‌ జారీ చేసింది. గతంలో తన ఆస్తులను కబ్జా చేశారని తంజావూరుకు చెందిన మనోహరన్‌ సతీమణి వలర్మతి ఫిర్యాదు చేశారు. దీంతో సుంద వదనన్‌, శశికళ బంధువులు 10 మందిపై కేసు నమోదయ్యాయి. కోర్టు విచారణకు వీరు హాజరు కాకపోవడంతో వీరిని పట్టుకుని కోర్టులో మాజరు పర్చాలని తంజావూరు కోర్టు పీటీ వారెంట్‌ జారీ చేసింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort