షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2020 9:19 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 77లక్షల మంది ఈ మహమ్మారి భారీన పడగా.. 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వారు, వీరు అనే తేడా లేకుండా అందరికి సోకుతోంది. కాగా.. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అప్రిదికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు.
గత గురువారం నుంచి ఒంట్లో అస్వస్థతగా ఉందని, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లానని, కరోనా పరీక్ష చేయించుకుంటే దురదృష్టవశాత్తు పాజిటివ్‌గా వచ్చినట్లు తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. తాను తొందరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థించాలని అతడి అభిమానులను కోరాడు. ఇక అప్రీధి ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అప్రిది త్వరగా కోలుకోవాలని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కరోనా సోకిన అఫ్రిదికి ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి, పాకిస్తాన్‌లోని నిరుపేదలకు అఫ్రిది తన ఫాండేషన్ ద్వారా సహాయం చేస్తున్నాడు. తన బృందంతో పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాడు. అప్రిధి పౌండేషన్‌కు భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లు సాయం చేసిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్‌లో కరోనా బారీన పడిన రెండో క్రికెటర్ అప్రిధి. అంతకముందు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కూడా ఈ మహమ్మారి బారీన పడగా.. తరువాత కోలుకున్నాడు. పాకిస్తాన్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 1 లక్షా 32 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 2600కి చేరింది.