ఉరి తీయాల‌్సిందే.. షాద్‌నగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!
By Newsmeter.Network Published on 30 Nov 2019 1:05 PM ISTహైదరాబాద్: వైద్యురాలి మృతిపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్యురాలిపై అంత్యంత కిరాతకంగా ప్రవర్తించిన.. నిందితులకు నిరసనగా స్థానికులు, విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆ దుర్మార్గులను వెంటనే ఉరితీయాలంటూ..డిమాండ్ చేశారు. దీంతో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నిందితులను వెంటనే ఉరితీస్తేనే వైద్యురాలికి న‌్యాయం జరుగుతుందని విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం అత్యా చారాలతో, హత్యలతో వణుకుతుందని.. అసలు మహిళలకు రక్షణే లేదని విద్యార్తినులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇంటి నుంచి బయటికి వెళ్తే.. సేఫ్‌గా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. ఏం చేస్తే ఈ మృగాలకి మహిళల పట్ల గౌరవం, భయం కలుగుతాయని విద్యార్తినిలు ప్రశ్నించారు. అనంతరం నిందితుల దిష్టిబొమ్మలను ఓ చెట్టుకు ఉరితీసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విద్యార్థినిలను అడ్డుకున్నారు. దీంతో స్థానికులు, విద్యార్థినిల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పోలీస్ స్టేష్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.