ప‌క్కా స్కెచ్‌తో.. ఆ న‌లుగురు క‌లిసి.. అత్యంత కిరాత‌కంగా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Nov 2019 3:13 PM GMT
ప‌క్కా స్కెచ్‌తో.. ఆ న‌లుగురు క‌లిసి.. అత్యంత కిరాత‌కంగా..

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ వెటర్నరీ డాక్టర్‌ హత్య కేసు మిస్ట‌రీ వీడింది. కేసు విషయాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. పక్కా పథకం ప్రకారమే ట్రాప్‌ చేసి అత్యాచారం చేసి, ఆపై చంపేశార‌ని తెలిపారు. సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మహ్మద్‌ ఆరీఫ్(A1), శివ( A2), నవీన్‌(A3), కేశవులు(A4)లు కలిసి హత్య చేసినట్లు పేర్కొన్నారు.

అస‌లేం జ‌రిగింది..

మృతురాలు.. 27వ తేదీన‌ తొండుపల్లి దగ్గరలోని టోల్‌ప్లాజా పక్కన స్కూటీని పార్క్‌ చేయడం నలుగురు నిందితులు చూశారు. సాయంత్రం బైక్‌ తీసుకుపోవడానికి వస్తుందని గమనించారు. శివ( A2) అనే వ్యక్తి ప్లాన్‌లో చూసిన‌ట్లుగా.. నవీన్‌ భాగంగానే ఆమె ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని బైక్‌ పంక్చర్‌ చేశాడు.

మృతురాలు రా. 9.13కి బైక్‌ కోసం తిరిగి వచ్చేలోపు అప్పటికే నలుగురూ మద్యం సేవించారు. స్కూటీ పంక్చర్‌ కావడంతో ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే తొలుత ఆమె దగ్గరకు ఆరీఫ్‌(A1) వచ్చి బైక్‌ తీసుకున్నాడు. పంక్చర్ చేయించూ అని శివను పంపించాడు.

అదే సమయంలో మృతురాలి చెల్లెలు ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడింది. అప్పటికే స‌మ‌యం రాత్రి 9:30 దాటింది. ప్లాన్ ప్ర‌కారం శివ( A2) టైర్‌లో కేవలం గాలి మాత్రమే కొట్టించాడు. ఈ లోపు ఆరీఫ్‌(A1), నవీన్‌(A3), కేశవులు(A4) కలిసి మృతురాలిని టోల్‌ప్లాజా పక్కన ఉన్న.. నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లారు.

మృతురాలు అరవకుండా ముక్కు, నోరు గట్టిగా నొక్కిపట్టారు. ఈలోపు శివ( A2) కూడా వచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. 27వ తారీఖు రాత్రి 10: 08 గంటలకే ఆమె చనిపోయింది. మృతురాలి శవాన్ని ఎవ‌రికి అనుమానం రాకుండా 10:30కి లారీలో తీసుకుని వెళ్లారు.

మధ్యలో ఓ పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఆగి బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకున్నారు. తెల్లవారుజూమున 2:30 గంటలకు చటాన్‌పల్లి శివారులో బ్రిడ్జి కింద‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అనుమానంతో రెండు గంటల తరువాత న‌లుగురు మరోసారి వచ్చి.. శవం కాలిందా.. లేదా..? అని చూసారు. కాలింద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చిన త‌రువాత వెనుతిరిగి వెళ్లార‌ని సీపీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు.

Press Meet 3 Press Meet 2 Press Meet 1

Next Story
Share it