షాద్ నగర్ పోలీసుల శ్రమదానం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Sep 2019 12:09 PM GMT- యుమ్మి బేకరీ ముందు రోడ్డు మరమ్మత్తులు
- చాలాకాలంగా రోడ్డుపై ప్రమాదాలు
- ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ పై నెటిజన్ల ప్రశంసల జల్లు
రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్‌లోని యుమ్మి బేకరీ ఎదురుగా పాత జాతీయ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాలు పడే సమయంలో ప్రమాదాల సంఖ్య ఇంకా ఎక్కువ. సంబంధిత అధికారులు స్పందించని పరిస్థితి. కాని..స్థానిక యువకులు మాత్రం రోడ్డును ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై స్పందించిన షాద్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తన సిబ్బందితో కలిసి రోడ్డు మరమ్మతు పనుల కోసం శ్రమదానం చేశారు. ఐరన్ మట్టితో గుంతలను పూడ్చేశారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఐరన్ మట్టిని గుంతల్లో నింపారు.
నెటిజన్ల ప్రశంసల జల్లు
పోలీసుల శ్రమదానంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రంగంలోకి దిగి శాశ్వత రోడ్డు మరమ్మతు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తో పాటు ఎస్సైలు తిరుపతి , విజయ్ భాస్కర్, కృష్ణలు, ఇతర సిబ్బంది నారాయణ రెడ్డి, మోహన్ లాల్, రమేష్, మల్లేష్ లు ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు..