ఏసీబీ వలలో షాబాద్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ శంకరయ్య
By తోట వంశీ కుమార్ Published on 9 July 2020 8:15 AM GMT
ఏసీబీ వలలో అవినీతి చేపలు చిక్కాయి. లంచం తీసుకుంటూ షాబాద్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్ ఏసీబీకి పట్టుబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. శంకరయ్యతో పాటు ఏఎస్‌ఐ రాజేందర్ రూ.లక్షా 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ భూ వివాదంలో డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
ఇటీవలే షాబాద్ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చిన శంకరయ్య గతంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఆయనపై భూ అక్రమాల ఆరోపణలు రావడంతో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ అయ్యారు.
Next Story