నా బాయ్‌ఫ్రెండే సెక్స్ రాకెట్‌లోకి దింపాడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Jan 2020 6:19 PM ISTబిగ్‌బాస్ రియాల్టీ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించిన వార్తలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంటాయి. అలాగే బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ,
బుల్లితెర నటుడు అర్హాన్‌ఖాన్ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ షోలోకి అడుగుపెట్టినప్పట్నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. కాంట్రవర్సీలకు ముద్దు బిడ్డగా మారిపోయాడు. గతంలో ఒక బిడ్డకు తండ్రి అన్న విషయాన్ని దాచి తోటి కంటెస్ట్ అయిన రశ్మీ దేశాయ్‌ను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. అయితే, అర్హాన్‌ఖాన్ అసలు స్వరూపాన్ని బిగ్‌బాస్ హోస్ట్ చేసే సల్మాన్‌ఖాన్ బయటపెట్టడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
ఇదిలా ఉండగా, అర్హాన్ ఖాన్ మాజీ ప్రేయసి అమృత ధనోవా షాకింగ్ ఆరోపణలు చేసింది. ఇటీవల అమృత ధనోవా సెక్స్‌రాకెట్‌లో పట్టుబడింది. ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అయితే తనను సెక్స్‌రాకెట్‌లో ఇరికించేలా చేసింది అర్హాన్‌ఖానేనంటూ అమృత మీడియా ముందు బయటపెట్టింది. తనను జైల్లో పెట్టించేందుకు అర్హాన్ ఖాన్ కుట్ర పన్నాడని తెలిపింది.
ఇదిలా ఉండగా, అమృత తనపై చేసిన ఆరోపణలపై స్పందించిన అర్హాన్ ఖాన్.., తనకు అమృత ధనోవా ఎవరో తెలియదని, ఎవరో కూడా తెలియని అమ్మాయిని సెక్స్ రాకెట్‌లో ఎందుకు ఇరికిస్తాను..? అంటూ సమాధానంగా చెప్పుకొచ్చాడు. కొన్ని మీడియా వర్గాలు ఆమె చెప్పే మాటలను పట్టించుకుని పాపులారిటీ కల్పిస్తుందన్నాడు.
అమృత మాత్రం అర్హాన్ తన మాజీ ప్రియుడని, ప్రేమిస్తున్నానని చెప్పి తన నుంచి ఐదు లక్షలు వసూలు చేశాడని గతంలో వెల్లడించింది. దాని గురించి కూడా అర్హాన్ ఖాన్ మాట్లాడుతూ అమృత ధానోవా నుంచి ఐదు లక్షలు తీసుకున్నట్టు నిరూపిస్తే ఆ డబ్బును ఆమెకు తిరిగిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తామిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే అయితే ఫోటోలు చూపించాలని డిమాండ్ చేశాడు.