భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 19 Sept 2019 6:12 PM IST

- బేర్ మన్న బుల్
- మార్కెట్ ను దెబ్బతీసిన అమెరికా, జపాన్ బ్యాంకులు
- డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.71.33
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 470.41 పాయింట్లు నష్టపోయి 36,093.47 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతొ 10,704 పాయింట్ల ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్గీ రేట్లు తగ్గింపు, బ్యాంక్ ఆఫ్ జపాన్ తమ పాలసీలను మార్చుకోకపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు బలహీనంగా ఉండటం కూడా మార్కెట్ల పతనానికి కారణమని చెప్పాలి. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.33గా ఉంది.
Next Story