ప్రముఖ పాత్రికేయులు చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూత
By న్యూస్‌మీటర్ తెలుగు
ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి ఉదయం తుది శ్వాస విడిశారు. ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారి పేరు గాంచారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. ఈయన విశాలాంధ్ర సంపాదకులుగా 30 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించించారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా కూడా సేవలందించారు.
చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తమ సంతాపం తెలిపారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ఆయన విశ్వసించారని.. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి చేసిన సేవలు ఎనలేనివని సీఎం కొనియడారు. యువ తరాలకు రాఘవాచారి ఆదర్శంగా నిల్చారని పేర్కొన్నారు. అనంతరం రాఘవాచారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.