మహబూబ్‌నగర్‌: సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కిడ్నాప్‌, హత్య

By సుభాష్  Published on  20 Jun 2020 5:02 AM GMT
మహబూబ్‌నగర్‌: సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కిడ్నాప్‌, హత్య

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడిని కిడ్నాప్‌కు గురై ఆ తర్వాత హత్యకు గురయ్యారు. దీంతో జిల్లాలో సంచలనంగా మారింది. ఓ వివాదస్పద భూమి విషయంలో జడ్చర్ల మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ రామచంద్రారెడ్డిని అలియాస్‌ పెట్రోల్‌ బంక్‌ రామచంద్రారెడ్డి ఇటీవల షాద్‌నగర్‌లో దుండగులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆయనును హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామం సమీపంలో రామచంద్రరెడ్డిని దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది.

శుక్రవారం షాద్‌నగర్‌లో రామచంద్రారెడ్డి తన కారులో కూర్చుని ఉండగా, స్థానికుడైన అన్నారం ప్రతాప్‌రెడ్డి ఆయనను కారులోంచి దించి తన వెంట తీసుకెళ్లినట్లు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ప్రతాప్‌రెడ్డికి, రామచంద్రారెడ్డికి మధ్య గత కొంత కాలంగా భూ వివాదం కొనసాగుతోంది. కాగా, రంగారెడ్డి జిల్లా ఫరూక్‌ నగర్‌ మండలం అన్నారం గ్రామంలో ఓ భూమి వివాదంలో ఉంది. ఈ భూమి విషయంలో రెండు వర్గాల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే జడ్చర్లలో రామచంద్రారెడ్డికి మంచి పేరుంది. ఇటీవల కూడా ఈ వివాదంపై కేసు కూడా నమోదైనట్లు షాద్‌నగర్‌ పోలీసులు చెబుతున్నారు.

Next Story
Share it