వారిని పంపేయండి.. వీళుకాకుంటే నిర్బంధ కేంద్రాలకు తరలించండి

By Newsmeter.Network  Published on  1 April 2020 9:21 AM GMT
వారిని పంపేయండి.. వీళుకాకుంటే నిర్బంధ కేంద్రాలకు తరలించండి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం.. భారత్‌లోనూ పెరుగుతుంది.. రోజురోజుకు చాపకింద నీరులా మహమ్మారి విస్తరిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడి దేశంలో ఇప్పటికే 1600 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 53 మంది మృత్యువాత పడ్డారు. భారత్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించింది. దీంతో భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గిందని భావిస్తున్న తరుణంలో ఢిల్లిలో మర్కజ్‌లో మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో వైరస్‌ లక్షణాలు కనిపించడంతో మళ్లి ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది.

Also Read : నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

ఈ మత ప్రార్థనల్లో విదేశీయులు పాల్గొన్నారు. దీంతో మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర, కేంద్ర పాలిక ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశీయులను తనిఖీ చేసి వీలైనంత త్వరగా వారిని దేశం నుంచి పంపించి వేయాలని కేంద్రం ఆదేశించింది. వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలితే చికిత్స అందజేయాలని, మిగిలిన వారిని అందుబాటులో ఉన్న విమానానికి పంపించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Also Read :ఏకతాటిపైకి రాకుంటే.. మానవ సంక్షోభం తప్పదు – ఐక్యరాజ్య సమితి

జమాత్‌కు వచ్చిన విదేశీ బృందాలు ప్రస్తుతం భారత్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ప్రస్తుత సమాచారం ప్రకారం 2వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోందని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ పేర్కొంది. వారు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని, ఈలోపు వారిని గుర్తించి విమానాలు ఎక్కించాలని సూచించింది. లేని పక్షంలో నిర్బంధ కేంద్రాలకు పంపించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. వారిని తీసుకొచ్చిన సంస్థలే ఖర్చులు భరించేలా చూడాలని హోంశాఖ స్పష్టం చేసింది.

Next Story