Fact Check : ఎలుక మాంసాన్ని అమ్మినందుకు అట్లాంటాలో చైనాకు చెందిన రెస్టారెంట్ ను మూసి వేసారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 2:00 PM GMT
Fact Check : ఎలుక మాంసాన్ని అమ్మినందుకు అట్లాంటాలో చైనాకు చెందిన రెస్టారెంట్ ను మూసి వేసారా..?

ఎలుక మాంసాన్ని అమ్మినందుకు అట్లాంటాలో చైనీస్ రెస్టారెంట్ ను మూసి వేసినట్లు చెబుతూ ఫేస్ బుక్ యూజర్లు పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. ట్రాన్స్పరెంట్ గా ఉన్న సీల్ చేసిన బ్యాగ్ లో చిన్న ఎలుకలు ఉన్నాయి.

ఫేస్ బుక్ యూజర్ డయానా లవ్ “Better Stop dinning with Chin” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చైనీస్ బ్రిస్టోలలో తినడం మానేస్తే మంచిది అంటూ చెప్పుకొచ్చారు.

“A popular Asian/Chinese restaurant Bistro in Atlanta was closed down this morning after authorities received a tip that the owner was accepting shipments of rats and mice from a vendor to prepare dishes. The owner and his wife were arrested early this morning and charges are not known at this time. After a full search of the kitchen, authorities found, packaged rats, mice, kittens, pups… So Now U KNOW! Bon Appetite” అంటూ చేసిన పోస్టుకు 2000 కు పైగా షేర్స్ వచ్చాయి.

అట్లాంటా లోని పాపులర్ ఏషియా/చైనీస్ రెస్టారెంట్ ను అధికారులు మూసివేశారు. చైనా నుండి ఎలుకల మాంసానికి సంబంధించిన పార్సల్ రావడాన్ని పోలీసులు గుర్తించారు. వాటితోనే రెస్టారెంట్ లో వంటలు తయారు చేస్తున్నారని.. అందుకే రెస్టారెంట్ ఓనర్ ను అతడి భార్యను అదుపు లోకి తీసుకున్నారు. వంటగదిలో అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎలుకలు, పిల్లులు, కుక్కలకు సంబంధించిన మాంసం లభించింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి అని అందులో ఆమె చెప్పుకొచ్చింది.

'మీరు చైనీస్ ఫుడ్ తినడాన్ని ఆపకపోవడంతో ఏమైనా జరగొచ్చు. నేను చైనా నుండి వచ్చే ఫుడ్ ను తీసుకోవడం లేదు.. వాళ్ళను నమ్మలేము' అంటూ మరో వ్యక్తి పోస్టు చేశారు.

నిజ నిర్ధరణ:

అట్లాంటాలో ఓ రెస్టారెంట్ ను మాంసం అమ్ముతున్నారన్న ఆరోపణలతో మూసి వేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఎలుక మాంసాన్ని అమ్మిన ఆరోపణలతో మూసి వేయలేదు.

వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. పాములకు, సరీసృపాలకు ఆహారంగా వేసే ఎలుకలని.. వీటిని అమ్మే వెబ్ సైట్ లింక్ లో మనం చూడవచ్చు. పాములు, తొండలు వంటి వాటిని పెంచుకుంటూ ఉన్న వాళ్లు ఈ వెబ్సైట్ లో తరచుగా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆ వెబ్ సైట్ లో పెట్టిన ఫోటోనే వైరల్ అవుతోంది.

https://southfloridarodents.com/product/25-frozen-fuzzy-rats/

కరోనా వైరస్ కారణంగా సామాజిక మాధ్యమాల్లో చైనా మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ట్విట్టర్ లో చైనా మీద 900 శాతం ఎక్కువ విద్వేషం రగులుతోంది. కరోనా వైరస్ మాత్రమే కాకుండా మరికొన్ని కారణాల వలన భారత్, అమెరికాలలో చైనా వ్యతిరేక ఉద్యమాలు నడిచాయి.

ఎలుక మాంసాన్ని అమ్మినందుకు అట్లాంటాలో చైనాకు చెందిన రెస్టారెంట్ ను మూసి వేసారన్నది 'అబద్ధం'

Next Story