ఢిల్లీ: దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో విద్యాంస్థలకు సెలవులు ప్రకటించారు. రాజస్థాన్‌లో కూడా 144 సెక్షన్‌ విధించారు. ఈ నెల 19 వరకు రాజస్థాన్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. అలాగే కర్నాటక, మధ్యప్రదేశ్‌లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అజ్మీర్‌లోనూ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మహారాష్ట్రలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. దేశవాప్తంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు వేల కేంద్ర బలగాలతతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.