భారత్‌లో రెండో 'కరోనా' కేసు

By సుభాష్
Published on : 2 Feb 2020 11:20 AM IST

భారత్‌లో రెండో కరోనా కేసు

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇతర దేశాలు, రాష్ట్రాలు కూడా వణికిపోతున్నాయి. ఇక భారత్‌లో ఇటీవల త్రిపురా రాష్ట్రంలో కరోనా వైరస్‌ వల్ల ఒక వ్యక్తి మృతి చెందగా, కేరళలో ఒక పాటిజివ్‌ కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా కేరళ రాష్ట్రంలో మరో కేసు నమోదైంది.

మరోవ్యక్తికి కరోనా సోకడంతో తీవ్రసంచలనంగా మారింది. మొదటి కేసు కూడా ఇదే రాష్ట్రంలో నమోదు కావడంతో వైద్యులు వెనువెంటనే స్పందిస్తున్నారు. కరోనా వ్యాధిలక్షణాలు బయటపడిన వ్యక్తిని ప్రత్యేక వార్డ్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే రెండో కేసు కూడా నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఇటీవల చైనా నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. చైనా నుంచి వచ్చిన అధిక మందిలో విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story