ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం.. చివరికి నెగ్గేదెవరు?
By Newsmeter.Network
దేశవ్యాప్తంగా కరోనాపై చర్చ సాగుతుంటే.. ఏపీలో మాత్రం ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం పంతం నీదా.. నాదా అంటూ పోటీపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేసేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేయటంతో పాటు పంచాయతీ ఎన్నికలు మినహా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయ్యా యి. ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. తమ పార్టీల అభ్యర్థులను నామినేష న్లు వేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించాయి.
Also Read : !గవర్నర్‌ను కలవనున్న ఈసీ.. ఏం నిర్ణయం తీసుకుంటారో !
దీనికితోడు బీజేపీ, జనసేనలు నామినేషన్లు జరిగిన సమయంలో వైసీపీ కార్యకర్తల తీరును రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీసైతం పలుమార్లు ఫిర్యాదులు అందించింది. పలు ప్రాంతాల్లో టీడీపీనేతలపై వైసీపీ నేతలు చేసిన దాడులకు సంబంధించి న వీడియోలను చంద్రబాబు మీడియా ఎదుటసైతం ప్రదర్శించా రు. ఇదే సమయంలో కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఏపీలోనూ కరోనా పాజిట్‌కేసు నమోదు కావటంతో ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎస్‌ఈసీ రమేష్ కుమార్ ప్రకటించారు.
ఎస్‌ఈసీ ప్రకటనతో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే గవర్నర్ తో భేటీ అయ్యి ఎన్నికల వాయిదా, తదితర విషయాలపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో ఎస్‌ఈసీ రమేష్ కుమార్‌పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వం నడిపేది 150 సీట్లున్న మేమా..? ఎస్‌ఈసీనా అంటూ ఘాటుగా ప్రశ్నించా రు. రమేష్ కుమార్ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని, చంద్రబాబే ఎస్‌ఈసీగా నియమించాడని.. ఇప్పుడు కావాలని ఇద్దరు కూడబలుక్కొని ఎన్నికలు వాయిదా వేశారంటూ మండిపడ్డారు. అసలు మమ్మల్ని సంప్రదించకుండా ఎన్నికలు ఏకపక్షంగా ఎలా వాయిదా వేస్తారంటూ ప్రశ్నిం చారు.
దీనికి తోడు సోమవారం ఏపీ ప్రభుత్వ సీఎస్ నీలం సాహ్ని ఎస్‌ఈసీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదని, ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని, ఎన్నికల నిర్వహణకు పునరాలోచించాలని లేఖలో పేర్కొన్నారు. సీఎస్ లేఖరాసిన కొద్దిసేపటికి ఎస్‌ఈసీ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఎన్నికలు వాయిదా వేయటానికి గల కారణాలను గవర్నర్‌కు వివరించారు.
Also Read :ఇక సీఎంలు ఎందుకు..? ప్రభుత్వాలు ఎందుకు..?
ఎన్నికల వాయిదా వేయడాన్ని తప్పు పడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగానే ఎస్‌ఈసీ ఎన్నికలను వాయిదా వేశారంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను రేపు జస్టిస్ లలిత్ బెంచ్ విచారణ చేపట్టనుంది. మరోవైపు హైకోర్టులోనూ ఎన్నికల వాయిదాపై పిటీషన్ దాఖలైంది.
ఇలా ఎస్‌ఈసీ వర్సెస్ వైకాపా ప్రభుత్వం మధ్య నువ్వా.. నేనా అన్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వార్‌సాగుతుంది. ఇదే సమయంలో బీజేపీతో సహా ప్రతిపక్షాలన్నీ ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి ఈసీని ప్రశ్నించడం ఏమిటని, అసలు ఎస్‌ఈసీకి లేఖ రాసే హక్కు సీఎస్‌కు ఎక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు, ఎస్‌ఈసీ, అటు వైసీపీ మధ్య పోరుతో ఏపీలో వాతావరణం హీటెక్కింది. చివరకు ఈ పరిణాలు ఎస్‌ఈసీ కి అనుకూలంగా మారుతాయా.. వైకాపా ప్రభుత్వంకు అనుకూలంగా మారుతాయో వేచి చూడాల్సిందే.