14 కాళ్లున్న సముద్ర బొద్దింకను కనుగొన్న పరిశోధకులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 3:34 AM GMT
14 కాళ్లున్న సముద్ర బొద్దింకను కనుగొన్న పరిశోధకులు..!

సింగపూర్ కు చెందిన పరిశోధకులు సముద్ర బొద్దింకను కనిపెట్టారు. హిందూ మహా సముద్రం అడుగు భాగంలో ఉన్న సముద్ర బొద్దింక పరిశోధకులకు కనిపించింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన పరిశోధకులు 14 రోజుల పాటూ హిందూ మహా సముద్రంలోని లోతైన ప్రాంతంలో వెతకగా వారికి ఈ సముద్ర బొద్దింక కనిపించింది. ఈ మెరైన్ సర్వే పీటర్ ఎన్.జి. సారథ్యంలో జరిగింది. మొత్తం 12000 కు పైగా సముద్ర ప్రాణులను ఇండోనేషియా దగ్గర ఉన్న పశ్చిమ జావ దగ్గర సేకరించారు. ఈ బృందం 12 కొత్త జీవులను కూడా కనుక్కుంది.

ఈ బొద్దింక 14 కాళ్లతో ఉన్నట్లు గుర్తించారు. "Bathynomus raksasa" (బతీనోమస్ రక్సాసా) అనే పేరు పెట్టారు. ఈ సముద్ర బొద్దింక చాలా లోతైన ప్రాంతాల్లో జీవిస్తూ కనిపిస్తూ ఉంటోంది. దాదాపు 20 ఇంచీలు సైజు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. బతీనోమస్ రక్సాసాకు సముద్ర బొద్దింక అంటూ పేరు పెట్టారు. సముద్రంలో ఉండే పీతలకు, ష్రిమ్ప్స్ దీనికి దగ్గర సంబంధం ఉందని చెబుతున్నారు.

సముద్ర జంతువుల కళేబరాలకు తింటూ ఇవి బ్రతుకుతూ ఉంటాయని చెబుతున్నారు. చాలా రోజుల పాటూ ఎటువంటి తిండి కూడా తినకుండా బ్రతకగలవవట..! వీటికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి.

Next Story