విమానాశ్రయాల్లో ‘కరోనా వైరస్‌‘ గుర్తిస్తున్నారిలా..?

By సుభాష్  Published on  29 Jan 2020 11:23 AM GMT
విమానాశ్రయాల్లో ‘కరోనా వైరస్‌‘ గుర్తిస్తున్నారిలా..?

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ దేశవ్యాప్తంగా గడగడలాడిస్తోంది. ఈ వైరస్‌ మా దేశాల్లోకి రానివ్వకూడదంటూ ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో జాగ్రత్త పడుతున్నాయి. ఇందులో భాగంగా కోల్‌కతా అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌ లలోనూ కేంద్ర పౌర, విమానాయన శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయానికి వచ్చిపోయే వాళ్లకు వైరస్ ఉందా..? లేదా.. అని గుర్తించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ లలో అడుగు పెట్టగానే.. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేవాళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మాదిరిగా కోల్‌కతా విమానాశ్రయంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ డివైస్‌ లతో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలా స్కీనింగ్‌ చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నారు.

ఏదైన పసిగట్టినట్లయితే వెంటనే అధికారుల సమాచారం చేరవేస్తున్నారు. చైనా నుంచి వచ్చే వాళ్లను మరి జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, ముంబాయి, కోల్‌కతా తదితర ఏడు విమానాశ్రయాల్లో భారత పౌర విమానయాన శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇలా కరోనా వైరస్‌ను పసిగట్టేందుకు 10 థర్మల్‌ స్ర్కీనింగ్‌ డివైస్‌లను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు అధికారులు. గత 15 రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు.. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద రిపోర్ట్‌ చేయాలంటూ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.

Next Story