కరోనాని జయించేందుకు రంగంలోకి దిగిన చైనా ప్రధాని

By రాణి  Published on  28 Jan 2020 7:44 AM GMT
కరోనాని జయించేందుకు రంగంలోకి దిగిన చైనా ప్రధాని

ముఖ్యాంశాలు

  • కరోనా సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోలేని వూహాన్
  • అధికారుల వైఫల్యమే ప్రధాన కారణమని సోషల్ మీడియా పోస్టులు
  • నేరుగా రంగంలోకి దిగి వూహాన్ కి వెళ్లి చైనా ప్రధాని లీ
  • ఆసుపత్రికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించిన ప్రధాని లీ
  • వైద్య నిపుణులకు, సిబ్బందికి ప్రధాని లీ భరోసా
  • మరో రెండు రోజుల్లో 2,500 మంది అదనపు వైద్య సిబ్బంది
  • మందులు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశం
  • సామాన్యులకు వాటి ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశం

కరోనా సృష్టిస్తున్న బీభత్సం నుంచి వూహాన్ ని బయట పడేసేందుకు స్వయంగా చైనా ప్రధాని లీ కియాంగ్ రంగంలోకి దిగారు. నేరుగా ఆయనే వూహాన్ కి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఒక్కసారిగా కరోనా సృష్టించిన బీభత్సం చైనాని, ముఖ్యంగా వూహాన్ ని అతలాకుతలం చేసింది. వూహాన్ లో వెళ్లగానే నేరుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి కరోనానుంచి బైటపడేందుకు అధికారులు, వైద్యులు తీసుకుంటున్న చర్యలను తనిఖీ చేశారు కింగ్ లీ. నీలిరంగు రక్షణ కవచాన్నీ, ముఖానికి మాస్క్ నీ ధరించిన లీ చకచకా నడుస్తూ అధికారులను, వైద్యులను పరుగులు పెట్టించారు.

కరోనా మృతుల సంఖ్య 81కి పెరగడంతో నేరుగా ప్రధాని లీ నే స్వయంగా రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నిర్ణయించుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన కావాల్సిన వైద్య సదుపాయాలు అందేలా చూస్తామని ప్రధాని లీ వారికి హామీ ఇచ్చారు. వెంటనే అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. వెంటనే కరోనాని ఎదుర్కోవడానికి కావాల్సిన మందుల్ని మార్కెట్లో అన్ని ఫార్మసీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలనీ, అత్యంత తక్కువ ధరల్లో వాటిని ప్రజలకు ఇచ్చే ఏర్పాట్లు చెయ్యాలనీ ప్రధాని లీ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రాంణాంతకమైన వైరస్ నుంచి రక్షణ పొందడానికి ఉద్దేశించిన మాస్క్ లు, గ్లౌలు, మెడికల్ సూట్లు లాంటి వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పౌరులందరికీ అందజేసే ప్రయత్నాలు చెయ్యాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సైట్ ని సందర్శించిన రాజు లీ

రాబోయే రెండు రోజుల్లో కరోనాపై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా మరో 2,500మంది మెడికల్ వర్కర్లు వూహాన్ లోని ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తారని ప్రధాని లీ చెప్పారు. గాలిద్వారా వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ దుష్ప్రభావాల గురించి చైనా మీడియాలో చూసి తెలుసుకున్న లీ ప్రజలపట్ల ఉన్న ప్రేమతో తన స్థాయినిపట్టించుకోకుండా నేరుగా వూహాన్ కి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించడం, నైతికంగా ధైర్యాన్ని అందించడం అధికారుల్లో, వైద్య నిపుణుల్లో, మెడికల్ వర్కర్లలో, రోగుల్లో కొంతమేరకు ఆత్మస్థైర్యాన్ని నింపిందనే చెప్పాలి. వూహాన్ యుద్ధ ప్రాతిపదికను నిర్మితమవుతున్న మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సైట్ ని కూడా ప్రధాని సందర్శించారు. వీలైనంత త్వరగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. కరోనా వైరస్ ని డీల్ చెయ్యడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని ప్రజాగ్రహం సోషల్ మీడియాలో కట్టలుతెంచుకుంటున్న నేపధ్యంలో ప్రధాని లీ వూహాన్ ని సందర్శించడం విశేషం.

ఇప్పటివరకూ కరోనా బారిన పడినవాళ్ల సంఖ్య చైనాలో 2,835 కి పెరిగింది. హాంకాంగ్ లో ఎనిమిది మంది ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చైనాలో దాదాపు 250మందికి పైగా ఇదే పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వూహాన్ లో 81మంది కరోనావల్ల మృతిచెందినట్టుగా వస్తున్న వార్తల నేపధ్యంలో హుబేనుంచి రాకపోకలకు అనుమతిని రద్దు చేశారు. గడచిన 14 రోజులుగా ఈ నిషేధం కొనసాగుతోంది.

Next Story