గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ సోమవారం సాయంత్రం మొరాయించింది. యూట్యూబ్ పని చేయడం మానేసిందంటూ పలువురు ట్విట్టర్ లో ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ఎప్పటిలాగే యూట్యూబ్ ను వాడాలి అనుకున్న వాళ్లకు మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేసినా, డెస్క్ టాప్ లో ఓపెన్ చేసినా కూడా ఎటువంటి వీడియోలు కూడా కనిపించలేదు. కొద్ది నిమిషాల పాటూ 'there was problem with server' అనే మెసేజీని చూపించింది. టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటూ పలువురు యూట్యూబ్ ను తిట్టడం మొదలుపెట్టారు కూడానూ..! అంతేకాకుండా ఇంకొందరు మీమ్స్ కూడా పెట్టారు.

ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యూట్యూబ్ మొరాయించడంతో చాలా మంది షాక్ కు గురయ్యారు. కొద్దిరోజుల కిందట కూడా ఇలాంగే యూట్యూబ్ కొన్ని నిమిషాల పాటూ పనిచేయకుండా పోయింది. ఇప్పుడు ఇలా మరోసారి ఇబ్బంది పెట్టింది. యూట్యూబ్ డౌన్ అయిన సమయంలో వీడియోలను ప్లే చేయడానికి కానీ, అప్లోడ్ చేయడానికి కానీ వీలు పడలేదని పలువురు తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇదిలావుంటే.. యూ ట్యూబ్ డౌన్ అవ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో కూడా ఇలా చాలాసార్లు మొరాయించింది. వెంటనే అప్రమత్తమై యూట్యూబ్ టీమ్ స‌మ‌స్య‌ను త్వ‌ర‌గానే ప‌రిష్క‌రించేది. తాజాగా ఇప్పుడు కూడా త్వ‌ర‌గానే సమ‌స్య ప‌రిష్క‌రించ‌బ‌డింది.సామ్రాట్

Next Story