వాట్సప్ కొత్త పాలసీ.. కేవలం వారికి మాత్రమేనట!
WhatsApp New Privacy Policy. గత కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ పై కీలక ప్రకటనలు.
By Medi Samrat Published on 9 Jan 2021 2:10 PM ISTగత కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ పై కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త పాలసీలో వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు సంబంధించినటువంటి సమాచార విషయాలను మాత్రమే ఫేస్ బుక్ తో షేర్ చేసుకుంటామనే కీలక ప్రకటన చేసింది. అదేవిధంగా వాట్సాప్ వ్యక్తిగత వివరాలను వ్యాపార అవసరాలకు ఉపయోగించమని తాజా ప్రకటన చేయడంతో ఈ కొత్త పాలసీ పై యూజర్ లలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించి నట్లయింది.
కొద్ది రోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంలో యూజర్స్ వాట్సప్ ఓపెన్ చేయగానే వారికి సంబంధించిన విషయాల జాబితా చూపిస్తే ఒక విండో ప్రత్యక్షమవుతుంది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అమలులోకి రాబోయే ఈ పాలసీని కచ్చితంగా యూజర్లు అనుమతించాలని తెలియజేసింది. ఇందులో భాగంగానే వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత విషయాలతో పాటు, ఐపీ అడ్రస్ వంటి వివరాలను ఫేస్ బుక్ తో పంచుకుంటారని వార్తలు వెలువడడంతో యూజర్లు ఆందోళన చెందారు. తాజాగా వాట్సాప్ బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తామని తెలియడంతో యూజర్ల లో నెలకొన్న గందరగోళం తీరింది.
ఈ నేపథ్యంలోనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై స్పందించారు. వాట్సాప్‌కి బదులు సిగ్నల్ యాప్ ఉపయోగించాలని ట్వీట్ చేశారు. దీంతో సిగ్నల్ యాప్‌కి యూజర్స్ తాకిడి పెరిగిపోయింది. ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో యూజర్లు సిగ్నల్ యాప్ ను వినియోగించడంతో కొద్దిపాటి సమస్యలు తలెత్తాయి.అయితే ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని సిగ్నల్ యాప్ అధికారులు తెలియజేశారు.