వాట్సాప్, ఇంస్టాగ్రామ్ బాగా మొరాయించేశాయిగా

WhatsApp Instagram Restored After Facing Global Outage.వాట్సాప్, ఇంస్టాగ్రామ్ యాప్స్ శుక్రవారం రాత్రి సమయంలో బాగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 3:33 AM GMT
వాట్సాప్, ఇంస్టాగ్రామ్ బాగా మొరాయించేశాయిగా

వాట్సాప్, ఇంస్టాగ్రామ్ యాప్స్ శుక్రవారం రాత్రి సమయంలో బాగా మొరాయించాయి. అలాగే ఫేస్‌బుక్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదికలు శుక్రవారం రాత్రి చాలా సేపు మొరాయించాయని పలువురు యూజర్లు చెప్పుకొచ్చారు. ఏదైనా సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం అవ్వలేదని.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్‌ను అప్‌డేట్‌ అవ్వడం లేదని పలువురు యూజర్లు తెలిపారు.తమ అకౌంట్లలో లాగిన్‌ అవ్వలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.

రాత్రి 11 సమయంలో ఈ సమస్యలపై ట్విట్టర్ లో పోస్టు చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది సమయంగా ఈ యాప్స్ పని చేయడం లేదంటూ ట్విట్టర్ లో మొరపెట్టుకున్నారు. పలువురు కూడా తమకు ఇలాంటి సమస్యనే ఎదురవుతోంది అంటూ చెప్పుకొచ్చారు. వాట్సాప్, మెసెంజర్లలో కనీసం మెసేజ్ పంపాలన్నా కూడా వీలు పడలేదు.. ఇక ఇంస్టాగ్రామ్ లో ఫోటో కానీ.. వీడియో కానీ అప్లోడ్ చేయాలని అనుకున్నా కూడా కుదరలేదని పలువురు చెప్పారు.

ఫేస్ బుక్ కు చెందిన కొన్ని యాప్స్ మొరాయించాయని.. అందుకు కారణం టెక్నికల్ సమస్యలేనని ఫేస్ బుక్ సంస్థ తెలిపింది. సమస్యను పరిష్కరించామని.. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించండి అంటూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి 11:40 వరకూ ఈ సమస్య తలెత్తినట్లు పలు వెబ్సైట్లు చెప్పుకొచ్చాయి. సర్వర్‌ డౌన్‌ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ 'డౌన్‌ డిటెక్టర్‌' గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు.


Next Story