వాటికి చెక్‌పెట్టేలా.. వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. ఇది ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే సోషల్‌మీడియా

By అంజి  Published on  9 May 2023 3:00 AM GMT
WhatsApp, WhatsApp new features

వాటికి చెక్‌పెట్టేలా.. వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. ఇది ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే సోషల్‌మీడియా యాప్‌ల్లో ఒకటి. వాట్సాప్‌ తన యూజర్ల ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్‌లను తీసుకువస్తూనే ఉంది. యూజర్ల అభిరుచికి, కాలానుగుణంగా వాటాప్స్‌లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే మరో రెండు కొత్త ఫీచర్లన తీసుకొచ్చింది వాట్సాప్. గ్రూపుల్లో వచ్చే అనుచిత మెసేజ్‌లపై రిపోర్ట్‌ చేయడం, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్‌ సైలెంట్‌గా ఉంచేలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

కొత్త ఫీచరైన అడ్మిన్‌ రివ్యూ గురించి: గ్రూపుల్లో ఎవరైనా అనుచిత మెసేజ్‌లు పంపిస్తే.. వాటిని గ్రూప్‌ సభ్యులు అడ్మిన్‌కు రిపోర్ట్‌ చేయొచ్చు. సభ్యులు ఒక సందేశాన్ని ఫిర్యాదు చేసినప్పుడు.. అది సమీక్ష నిమిత్తం గ్రూప్‌ అడ్మిన్‌కు ఫార్వార్డ్‌ అవుతుంది. ఆ తర్వాత అది అనుచితం అని గ్రూప్‌ అడ్మిన్‌ భావిస్తే.. దానిని తొలగించవచ్చు. ఈ ఫీచర్‌ గ్రూప్‌ పేజీల సెట్టింగ్స్‌లో ఉంది. దీనిని గ్రూప్‌ అడ్మిన్లు మాత్రమే ఎనేబుల్‌ చేసే ఛాన్స్ ఉంది. అనుచిత మెసేజ్‌లపై రిపోర్ట్‌ చేసే ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది.

దీంతో పాటు వాట్సాప్‌ డెవలపర్లు మరో కొత్త ఫీచర్‌పైనా వర్క్‌ చేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్‌ సైలెంట్‌గా ఉంచేందుకు వీలుగా డెవలప్‌ చేస్తున్నారు. ఇది వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ సెక్షన్‌లో ఉంటుంది. తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యూజర్లు వాటిని మ్యూట్‌ చేసుకోవచ్చు. అయితే ఆ కాల్స్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ వస్తుంది. కాల్స్‌ను మ్యూట్‌ చేసే ఫీచర్‌.. వాట్సాప్‌ తాజా వెర్షన్‌లోని బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉంది.

Next Story