'హాయ్‌ బడ్డీ.. వెల్‌కమ్‌'.. విక్రమ్‌ ల్యాండర్‌కు చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ పలకరింపు

చంద్రయాన్‌ - 3 ల్యాండర్‌కి చంద్రయాన్‌ -2 ఆర్బిటర్‌ వెల్‌కమ్‌ బడ్డీ అంటూ స్వాగతం పలికింది.

By అంజి  Published on  22 Aug 2023 9:15 AM IST
Chandrayaan-2, Vikram lander,Moon,orbit

'హాయ్‌ బడ్డీ.. వెల్‌కమ్‌'.. విక్రమ్‌ ల్యాండర్‌కు చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ పలకరింపు

చంద్రయాన్‌ - 3 ల్యాండర్‌కి చంద్రయాన్‌ -2 ఆర్బిటర్‌ వెల్‌కమ్‌ బడ్డీ అంటూ స్వాగతం పలికింది. చంద్రుని ఉపరితలంపైకి దిగడానికి రెండు రోజుల సమయం ఉండగా, చంద్రయాన్-3 ల్యాండర్ నిన్న మధ్యాహ్నం చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో కమ్యూనికేషన్‌ ఏర్పరచుకుంది. ల్యాండర్, ఆర్బిటర్ 'టూ-వే కమ్యూనికేషన్'ను ఏర్పాటు చేశాయి. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ల్యాండర్‌తో మరింత సులభంగా సంబంధాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుందని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. నాలుగేళ్ల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌.. తాజాగా చంద్రయాన్‌-3తో టచ్‌లోకి వచ్చింది. చంద్రయాన్-2 మిషన్‌తో ఇస్రో చంద్రుడి ఉపరితలంపై తన తొలి ల్యాండింగ్‌కు ప్రయత్నించి, విఫలమైనప్పటికీ 2019 నుండి ఆర్బిటర్ చంద్రుని చుట్టూ తిరుగుతోంది.

ఈ మిషన్ పాక్షిక వైఫల్యంతో ముగిసింది. అయితే కొన్ని ఖచ్చితమైన ప్రయోగం, కక్ష్య యుక్తుల కారణంగా ఆర్బిటర్‌ జీవితం ఏడు సంవత్సరాలకు పొడిగించబడింది. కాగా చంద్రయాన్‌ -2 ప్రయోగించిన నాలుగు సంవత్సరాల తరువాత, ఇస్రో చంద్రయాన్ -3 తో మరో ప్రయత్నం చేస్తోంది. దీని ల్యాండర్ - విక్రమ్ (చంద్రయాన్ -2 యొక్క ల్యాండర్‌కు అదే పేరు పెట్టారు). ఆగస్టు 23, బుధవారం చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చంద్రయాన్‌-2 మిషన్‌ విఫలమైనా ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే తిరుగుతున్న ఆర్బిటర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం అన్వేషణ సాగిస్తున్న విక్రమ్‌ ల్యాండర్‌కు స్వాగతం పలికింది.

ప్రస్తుతం చంద్రుని కక్ష్యలో ఉన్న ఈ రెండింటినీ శాస్త్రవేత్తలు అనుసంధానించారు. భూమివైపు నుంచి మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుని అవతలివైపు ఫొటోలను తన కెమెరాలో బంధించి పంపించింది. ఆ ఫొటోలను ఇస్రో సోమవారం ట్విటర్‌లో షేర్‌ చేసింది. విక్రమ్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా (ఎల్‌హెచ్‌డీఏసీ) ఈ ఫొటోలు తీసింది. ల్యాండర్, దాని లోపల ఉంచిన ప్రగ్యాన్ రోవర్‌తో పాటు బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగే అవకాశం ఉంది. ల్యాండింగ్ ఈవెంట్ యొక్క ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5.20 గంటలకు ప్రారంభమవుతుంది .

Next Story