మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌

Samsung india launches a new galaxy A series smartphone. ప్రముఖ మొబైల్‌ కంపెనీ.. శాంసంగ్ భారతదేశంలో కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు

By అంజి  Published on  6 Oct 2022 7:34 AM GMT
మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ మొబైల్‌ కంపెనీ.. శాంసంగ్ భారతదేశంలో కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు Samsung Galaxy A04s. ఇది 4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీతో ఒకే వేరియంట్‌లో వస్తుంది. శాంసంగ్.కామ్‌, ప్రధాన ఇ-కామర్స్ పోర్టల్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. సరసమైన ధరలో ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.5-అంగుళాల 90Hz ఇన్ఫినిటీ-V HD+ డిస్‌ప్లేతో 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాలను ప్యాక్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5-మెగాపిక్సెల్ కెమెరాను ఉంటుంది.

ఈ ఫోన్‌లో Exynos 850 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారంగా వన్ యూఐ కోర్‌తో స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ బాక్స్‌లో 15 వోల్ట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్‌కు పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇతర కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇంటర్‌డ్యూస్‌ ఆఫర్‌లో భాగంగా, శామ్‌సంగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వన్ కార్డ్, స్లైస్ కార్డ్‌తో కలిసి రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేసింది. ఇది రూ.12,499లకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో లభిస్తుంది.

Next Story