ఫోన్ నంబర్లు ఫేస్‌బుక్ నుండి లీక్ అయ్యాయా..?

Phone numbers of nearly 500 million Facebook users up for sale via Telegram bot.ఫేస్‌బుక్‌ 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి.

By Medi Samrat  Published on  26 Jan 2021 8:22 AM GMT
Phone numbers of nearly 500 million Facebook users up for sale

ఒక్కో యూజర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఫేస్ బుక్ తో లింక్ అయి ఉంటాయని తెలిసిందే..! ఇలా ఖాతాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు చాలా జాగ్రత్తగా ఉంటాయని ఇతరుల దగ్గరకు వెళ్లవని ఫేస్ బుక్ చెబుతోంది. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.

ఫేస్‌బుక్‌ 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి. 2019 లో ఫేస్‌బుక్‌లో లీక్‌ అయిన ఒక పాచ్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై చాలా ప్రశ్నలు వస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం, 533 మిలియన్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు బహిర్గతమయ్యాయి. సుమారు 6 లక్షల మంది భారతీయ వినియోగదారుల మొబైల్‌ నెంబర్లు చోరీకి గురయ్యాయి. యూజర్‌కు చెందిన ఒక్కో ఫోన్ నంబర్‌ 20 డాలర్ల చొప్పున అమ్ముడు పోయిందని తెలుస్తోంది. ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఫోన్‌ నెంబర్ల విక్రయిస్తున‍్నట్టు తెలుస్తోంది.

సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలోన్ గాల్ దీనికి సంబందించిన సమాచారంపై అప్రమత్తం చేశారని నివేదిక తెలిపింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల​కు ఫేస్‌బుక్‌ వినియోగదారులు ప్రభావితమయ్యారని అలోన్ వెల్లడించారు. బల్క్‌గా 10,000 నెంబర్లకుగాను 5,000 డాలర్లకు విక్రయిస్తున్నారన్నారు. ఈ డేటా బేస్‌ విక్రయం చాలా అందోళన కలిగించే పరిణామమని అలోన్ గాల్ చెబుతూ ఉన్నారు. అటు ఫేస్‌బుక్‌ గానీ, ఇటు టెలిగ్రామ్‌ గానీ ఈ నివేదికపై అధికారికంగా ఇంకా స్పందించలేదు.


Next Story