Oppo F19 Pro : అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో నుంచి మరో రెండు ఫోన్లు విడుదల

Oppo F19 Pro. చైనా కంపెనీ అయిన ఒప్పో మరో రెండు కొత్త ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

By Medi Samrat  Published on  9 March 2021 10:25 AM IST
Oppo F19 Pro : అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో నుంచి మరో రెండు ఫోన్లు విడుదల
చైనా కంపెనీ అయిన ఒప్పో మరో రెండు కొత్త ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్, ఒప్పో ఎఫ్ 19 ప్రోలు సోమవారం భారత్‌లో విడుదలయ్యాయి. అయితే ఒప్పో తన ఎఫ్17 సిరీస్ స్మార్ట్ ఫోన్లను సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తర్వాతి ఈ వెర్షన్‌గా ఫోన్లను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఒప్పో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పో ఎఫ్‌ 19 సిరీస్‌ ఫ్లోన్లు క్వాడ్‌ రియల్‌ కెమెరా, అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. రెండు మోడళ్లు కూడా ఆండ్రాయిడ్‌ 11 ఆధారంగా పని చేస్తాయి. మీడియాటెక్‌ డైమెన్సిటి 800U వస్తోన్న ఎఫ్‌ 19 ప్రో+5జీ కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. మీడియాటెక్‌ హీలియో P95తో విడుదలైన F19 ప్రొ 4జీ టెక్నాలజీని సపోర్ట్‌ చేస్తుంది. భారత్‌లో 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ఒప్పో ఎఫ్ 19ప్రొ+ ధర రూ.25,990గా నిర్ణయించారు.


8 జీబి ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఒప్పో ఎఫ్ 19 ప్రొ ధర రూ. 21,490గా ఉంది. ఎఫ్‌ 19 ప్రొలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,490గా నిర్ణయించారు. ఒప్పో ఫోన్లు ఫ్లూయిడ్‌ బ్లాక్‌, స్పేస్‌ సిల్వర్‌ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. మార్చి 17 నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ల సేల్‌ ఆరంభంకానుంది.

ఒప్పో ఎఫ్ 19 ప్రొ ప్లస్ స్పెసిఫికేషన్లు:

కలర్ ఓఎస్ 11.1తో కూడిన ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, బ్యాక్‌ వైపు 48 ఎంపీ సెన్సార్‌తో కూడిన నాలుగు కెమెరాలు, సెల్ఫీల కోసం ఫ్రంట్‌ భాగంలో 16 ఎంపీ కెమెరా. 128 జీబీని 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 5జీ, 4జీ కనెక్టివిటీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో ఎప్ 19ప్రొ స్సెసిఫికేషన్లు:

ఈ మొబైల్‌లో కలర్ ఓఎస్ 11.1తో కూడిన ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, బ్యాక్‌ 48 ఎంపీ సెన్సార్‌తో కూడిన నాలుగు కెమెరాలు ఉన్నాయి. అలాగే 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అయితే మిగతా స్పెసిఫికేషన్ల గురించి వెల్లడించాల్సి ఉంది.




Next Story