ISRO: విజయవంతంగా నింగిలోకి ఈవోఎస్-8 శాటిలైట్
స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)-డీ3 రాకెట్ ద్వారా ఈఓఎస్-08 శాటిలైట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది.
By అంజి Published on 16 Aug 2024 10:35 AM ISTISRO: విజయవంతంగా నింగిలోకి ఈవోఎస్-8
స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)-డీ3 రాకెట్ ద్వారా ఈఓఎస్-08 శాటిలైట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. చెన్నైకి తూర్పున 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 9.17 గంటలకు ముందుగా నిర్ణయించిన సమయానికి రాకెట్ సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.
ఈఓఎస్-08 శాటిలైట్ బరువు 175 కిలోలు. ఇందులో మిడ్ వేవ్, లాంగ్ వేవ్‌లో చిత్రాలను సేకరించేందుకు ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ - రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసీమీటర్ అనే మూడు పేలోడ్లను అమర్చారు. సముద్రాలపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, అగ్నిపరవ్త పేలుళ్లు, పారిశ్రామిక విపత్తులు, వరదలను గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ మిషన్ ఏడాదిపాటు సేవలు అందిస్తుంది. ఈఓఎస్-08 అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో కమ్యూనికేషన్, బేస్‌బ్యాండ్, స్టోరేజ్ , పొజిషనింగ్ ప్యాకేజీ అని కూడా పిలువబడే ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ సిస్టమ్ కూడా ఉంది.
#AndhraPradesh---@isro successfully launched a Small Satellite Launch Vehicle-03 (SSLV-D3-EOS-08) from Satish Dhawan Space Centre, #Sriharikota in #Tirupati district.The objectives of the SSLV-D3-EOS-08 mission include designing and developing a microsatellite and creating… pic.twitter.com/2Cdix83Y1N
— NewsMeter (@NewsMeter_In) August 16, 2024