టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ మోడళ్లను భారత్ లో తయారు చేయనుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఐఫోన్ సంస్థ ఇప్పటికే పలు ఐఫోన్ మోడల్స్ ను భారత్ లో తయారు చేస్తోంది. ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ లో కూడా ఫోన్స్ ను తయారు చేస్తోంది. ఐఫోన్ 16 మోడల్ మొబైల్స్ డిజైన్ ను విడుదల చేశాక, భారతదేశంలో కూడా తయారీ మొదలుపెడతారు.
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఈ హై-ఎండ్, ఇండియా-అసెంబుల్డ్ యాపిల్ పరికరాలు అందుబాటులో ఉంటాయని సంబంధిత వర్గాలు IANSకి తెలిపాయి. అంతేకాకుండా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన రోజే.. ఐఫోన్ 16 మోడల్స్ భారతదేశంలో కూడా మొదటి రోజునే అందుబాటులోకి రానున్నాయి. ఇంకో రెండు నెలల్లో ఐఫోన్ 16 ను మార్కెట్ లోకి తీసుకుని రానుంది యాపిల్ సంస్థ. ఇక కేంద్ర బడ్జెట్ 2024-25 తర్వాత భారత్‌లో ఐఫోన్ల ధరలు తగ్గాయి. భారత్‌లో పలు మోడళ్ల ఐఫోన్ల రేట్లను తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 14తో పాటు పలు మోడల్ ఫోన్ల రేట్లను రూ.6,000 వరకు తగ్గించింది యాపిల్ సంస్థ.