భారత్‌లోకి గూగుల్ వాలెట్.. ఇందులో వేటిని యాడ్ చేయొచ్చో తెలుసా?
భారత్‌లోకి గూగుల్ డిజిటల్ వాలెట్ ఎంట్రీ ఇచ్చింది. ఇది పూర్తిగా గూగుల్‌కు సంబంధించిన ప్రైవేట్ వాలెట్‌గా పని చేస్తుంది.
By అంజి Published on 20 May 2024 2:40 PM ISTభారత్‌లోకి గూగుల్ వాలెట్.. ఇందులో వేటిని యాడ్ చేయొచ్చో తెలుసా?
భారత్‌లోకి గూగుల్ డిజిటల్ వాలెట్ ఎంట్రీ ఇచ్చింది. ఇది పూర్తిగా గూగుల్‌కు సంబంధించిన ప్రైవేట్ వాలెట్‌గా పని చేస్తుంది. అసలు గూగుల్ పే ఉండగా మరి ఇదెందుకు? వాలెట్ వల్ల 'గూగుల్ పే'పై ఏమైనా ప్రభావం పడుతుందా అనే సందేహాలు కలిగే ఉంటాయి. అయితే ఇది పేమెంట్స్ చేయడానికి కాదు. ఇందులో ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేయగా వచ్చిన లాయల్టీ, గిఫ్ట్ కార్డులు, మూవీ టికెట్లు, పాస్‌లు, ఐడీలను భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇటీవల ప్లే స్టోర్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ పే పై దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని, దాన్ని ప్రాథమిక చెల్లింపుల యాప్‌గా కొనసాగిస్తామని గూగుల్ స్పష్టం చేసింది. దీన్ని ప్రధానంగనా లావాదేవీలకు కాకుండా నగదుకు సంబంధించిన ఇతర అవసరాల కోసం గూగుల్ కొత్తగా రూపొందించింది. అన్ని రకలా డాక్యుమెంట్స్ ఒకే చోట పొందుపర్చడానికి డిజీ లాకర్ ఉందని చాలా మందికి తెలుసు. ఇప్పుడు ప్రైవేట్, బ్యాంకింగ్‌కు సంబంధించినవి కూడా గూగు్ వాలెట్‌లో యాడ్ చేసుకోవచ్చు.
ఫోన్‌లోనే మెట్రో కార్డులు, విమాన టికెట్లు, బస్‌పాస్‌లు తీసుకువెళ్లవచ్చు. గూగుల్ సెర్చ్ నుంచి అందిన సమాచారంతో ప్రయాణ సమయాల్లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే లాయల్టీ, గిఫ్ట్ కార్డులను మనం మరిచిపోకుండా వాటి గడువు ముగిసేలోపు ప్రయోజనాలను గుర్తు చేస్తూ ఉంటుంది. సులభంగా వాటిని అనుసంధానం చేసుకోవచ్చు.
క్రికెట్ మ్యాచ్, మూవీ టికెట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ షో టికెట్లు వాలెట్‌కు జత చేసుకోవచ్చు. తద్వారా సమయానికి అది మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఫలితంగా వినోదాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇందులో పొందుపరిచే సమాచారం 2 స్టెప్ వెరిఫికేషన్‌తో ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. ఫైండ్ మై ఫోన్, రిమోట్ డేటా ఎరేజ్, కార్డు నంబర్లను ఎదుటివారికి కనిపించకుండా ఎన్‌క్రిప్టెడ్ పేమెంట్స్ కోడ్ వంటి గూగుల్ భద్రతా ఫీచర్లన్నీ వ్యాలెట్‌కూ వర్తిస్తాయి.