గూగుల్ మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ ఫీచర్.. ఫస్ట్ హైదరాబాద్‌తో పాటు ఆ నగరాల్లోనే
Google Maps launches street view in 10 Indian cities, including Hyderabad. గూగుల్ మ్యాప్స్ భారత్‌కు అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను బెంగళూరులో లాంచ్ చేసింది.
By అంజి Published on 28 July 2022 8:59 AM GMTగూగుల్ మ్యాప్స్ భారత్‌కు అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను బెంగళూరులో లాంచ్ చేసింది. త్వరలోనే భారత్‌లోని 10 నగరాల్లో స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించినట్లు సంస్థ బుధవారం తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా రోడ్లు, ఇతర ప్రాంతాల చిత్రాలను ప్రదర్శించడానికి ప్రభుత్వం గతంలో అనుమతించలేదు. తాజాగా జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూని ప్రారంభిస్తున్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ట్రాఫిక్ పోలీస్ విభాగంతోనూ అనుసంధానమవుతోంది. దీంతో వినియోగదారులకు స్పీడ్ లిమిట్, రోడ్ క్లోజ్ తదితర సమాచారం అందుతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే నగరంలోని ఏ ప్రాంతాన్నైనా రియల్‌స్టిక్‌గా చూడవచ్చు. వెళ్లానుకునే ప్లేస్‌కు త్వరగా వెళ్లవచ్చు.
మొదట బుధవారం పైలట్ ప్రాజెక్ట్ కింద బెంగళూరులో ఈ సదుపాయం ప్రారంభమవుతుంది. తొలి దశలో చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్‌తో సహా భారతదేశంలోని పది నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. 1,50,000 కిలోమీటర్ల మేర ఈ సేవలు అందుతాయి. స్థానిక భాగస్వామ్య సంస్థలతో కలిసి తాజాగా ఈ లైసెన్సును పొందామని గూగుల్ పేర్కొంది. గూగుల్.. జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రాతో కలిసి దీనిని 2022 చివరి నాటికి 50 కంటే ఎక్కువ నగరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి.
స్ట్రీట్ వ్యూతో ఉపయోగమేంటి?
ఈ ఫీచర్ కస్టమర్ల ప్రయాణాలను, షాపింగ్ అనుభవాలను మరింత సులభం చేస్తుంది. ఈ సదుపాయం ద్వారా మనం వెళ్లాలనుకున్న ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని గమనించవచ్చు. రెస్టారెంట్లలో, షాపింగ్ మాల్స్‌లో రియల్‌టైమ్‌ను పరిశీలించవచ్చు. అంటే వర్చువల్‌గా విజిట్ చేయవచ్చన్న మాట. రియల్ టైమ్ ట్రాఫిక్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే కచ్చితమైన నేవిగేషన్ సౌలభ్యం కూడా ఉంటుంది. మనం వెళ్లాలనుకున్న ప్రాంతంలోని ప్రత్యేకతలను కూడా గూగుల్ మ్యాప్స్ తన ఈ స్ట్రీట్ వ్యూలో పొందుపర్చనుంది. మొత్తంగా సెర్చ్ చేసిన ప్రాంతంలో ఏం ఉన్నాయో మన డివైజ్‌లోనే స్పష్టంగా చూడవచ్చు.
''గూగుల్ మ్యాప్స్ ప్రారంభమై 14 ఏళ్లు గడిచాయి. తాజాగా ప్రారంభించిన స్ట్రీట్‌వ్యూతో వినియోగదారులు మరింత కచ్చితమైన, ఉపయోగకరమైన సమాచారం పొందుతారు. ఈ స్ట్రీట్ వ్యూ కార్యరూపం దాల్చడానికి మ్యాపింగ్ సొల్యూషన్ కంపెనీ అయిన 'జెనెసిస్ ఇంటర్నేషనల్', లీడింగ్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ 'టెక్ మహింద్ర' సంస్థల సహకారం చాలా కీలకం. అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా సహకరించాయి.'' అని గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్ మిరియం కార్తికేయ డేనియల్ అన్నారు.
మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌లోకి వెళ్లి లోకేషన్ పేరును టైప్ చేసి.. సెర్చ్ చేయాలి. ఆ వెంటనే స్క్రీన్ కింది భాగంలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే చాలు.. స్ట్రీట్ వ్యూలో ఆ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది. లేకపోతే మ్యాప్‌పై కనిపించే లేయర్స్ సింబల్‌పై ట్యాప్ చేసి కూడా స్ట్రీట్ వ్యూను ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు చూడాలనుకుంటున్న లేదా వెళ్లాలనుకుంటున్న ప్రదేశాలను 3డీలో వర్చువల్‌గా విజిట్ చేయవచ్చు.