మన దేశంలోని అన్ని మొబైల్ నంబర్‌లకు 10 అంకెలు మాత్రమే ఉంటాయి. తొమ్మిది, పదకొండు అంకెలతో కూడిన నంబర్‌కు డయల్ చేసినా ఫోన్ రింగ్ అవ్వదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో కోట్ల సంఖ్యలో మొబైల్ యూజర్లు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన నంబర్లు ఇవ్వాలంటే భారీ సంఖ్యలో కేటాయింపులు కావాలి. అయితే 10 అంకెల వ్యవస్థ ద్వారా అపారమైన సంఖ్యలో విభిన్న నంబర్లను సృష్టించవచ్చు. ఇప్ఉడు 0 నుంచి 9 అంకెలలో ఒక డిజిట్‌తో మాత్రమే ఫోన్ నంబర్ ఉంటే.. కేవలం 10 నంబర్లను మాత్రమే తయారు చేయవచ్చు. దీంతో 10 మందికే నంబర్లు కేటాయించాల్సి వస్తుంది. అదే రెండు అంకెలతో ఫోన్ నంబర్ ఉంటే.. కేవలం 100 రకాల ఫోన్ నెంబర్లు రూపొందుతాయి.
అందుకే మన దేశ యూజర్ల కోసం ఫోన్ నంబర్‌లో ఎక్కువ అంకెలు ఉంచారు. ఇండియా జనాభా దాదాపు 140 కోట్ల వరకు ఉంది. ఫోన్ నంబర్ 10 అంకెలతో ఉంటే.. గణాంకాల ప్రకారం, వెయ్యి కోట్ల విభిన్న సంఖ్యలను రూపొందించవచ్చు. అంతకన్నా తక్కువ అంకెలతో ఫోన్ నంబర్ పెడితే భవిష్యత్తులో ప్రజలందరికీ ఫోన్ నంబర్లు కేటాయించడం కష్టమవుతుంది. అందుకే 2003లో టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఫోన్ నంబర్‌ను 9 అంకెల నుంచి 10 అంకెలకు పెంచింది.