బీ అలర్ట్‌.. వాట్సాప్‌ హ్యాక్‌ కాకుండా ఇలా చేయండి

హ్యాకర్లకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. రోజుకో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు.

By అంజి
Published on : 24 March 2025 1:45 PM IST

Smart phone, WhatsApp, Hack, Cyber ​​scammers

బీ అలర్ట్‌.. వాట్సాప్‌ హ్యాక్‌ కాకుండా ఇలా చేయండి

హ్యాకర్లకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. రోజుకో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్ని రోజులు మాల్వేర్‌ ఎటాక్‌, ఫిషింగ్‌లతో డబ్బు దోచుకున్న వీరు ఇప్పుడు వాట్సాప్‌ని హ్యాక్‌ చేస్తూ కొత్త మోసానికి తెర లేపుతున్నారు. స్కామర్లు వాట్సాప్‌ సపోర్ట్‌ టీమ్‌గా కాల్‌ చేసి యూజర్లను నమ్మిస్తూ ఓటీపీ తీసుకుంటున్నారు. తర్వాత వాట్సాప్‌ని హైజాక్‌ చేసి రిమోట్‌ యాక్సెస్‌ చేస్తూ మోసం చేస్తున్నారు.

హ్యాక్‌ కాకుండా ఇలా చేయండి

- మీ వాట్సాప్‌ హ్యాక్‌ అవ్వొద్దంటే కొన్ని సెట్టింగ్స్‌ మార్సుకోవాల్సి ఉంటుంది.

- సెట్టింగ్స్‌లో 2FA (రెండంచెల భద్రత)ని ఎనేబుల్‌ చేసి, అదనపు సేఫ్టీ కోసం ఇంకో పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవాలి.

- వాట్సాప్‌ సర్వీస్‌ నుంచి మనకు ఎలాంటి కాల్స్‌ రావు. వచ్చినా అవి నిజం కాదు. ఓటీపీ అడిగారంటే పక్కా మోసమే.

- మీ వాట్సాప్‌తో ఇతర డివైజ్‌లో లాగిన్‌ అయ్యారేమోని తరచూ చెక్‌ చేస్తూ ఉండాలి. ఒక వేళ అనధికార డివైజ్‌కు లింక్‌ అయ్యి ఉంటే - వెంటనే మీ ఫోన్‌లో ఆ డివైజ్‌ను డిజేబుల్‌ చేయాలి.

- అనుమానాస్పద లింక్స్‌ అస్సలు క్లిక్‌ చేయకూడదు.

Next Story