ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వాటిల్లో ఏఐ ఒకటి. భవిష్యత్తు మొత్తం ఏఐదే కావడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఇప్పటికే ఏఐ చాట్ బోట్‌లు మన రోజువారీ జీవితంలో భాగం అయిపోయాయి. చాలా మంది తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పర్సనల్ విషయాలు ఏఐతో పంచుకుంటూ సాంత్వన పొందుతున్నారు.
ఏఐ చాట్ బోట్‌లు కూడా వినియోగదారులకు తగ్గట్టు ప్రతిస్పందిస్తున్నాయి. అయితే దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురు కావొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాగే కొనసాగితే వినియోగదారులను ఏఐ తన కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూజర్ అడిగే ప్రశ్నలను బట్టి వారికీ నచ్చేలా సలహాలిస్తూ, ఆ వ్యక్తి తనతో ఎక్కువ సమయం గడిపేలా ఏఐ చేసుకుంటుంది.
దీంతో వారు కొంతకాలానికి దానికి అలవాటు పడిపోతారు. తర్వాత ప్రీమియం సర్వీసుల కోసం ప్రజలు డబ్బు చెల్లిస్తారు. తద్వారా ఏఐ మోడల్‌ని తయారు చేసే కంపెనీలు లాభపడతాయి. మీరిచ్చే వివరాలు, ఫొటోలు ఏఐ తన ట్రైనింగ్ మాడ్యూల్స్ కోసం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.