పాఠశాలలు తెరిచేందుకు ఎలాంటి ఆదేశాలు లేవు: తెలంగాణ విద్యాశాఖ

By సుభాష్  Published on  2 July 2020 8:26 AM GMT
పాఠశాలలు తెరిచేందుకు ఎలాంటి ఆదేశాలు లేవు: తెలంగాణ విద్యాశాఖ

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉండటంతో విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలు పునః ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెట్‌ పాఠశాలలు తెరిచేందుకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించింది.

అలాగే పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ బుధవారం ప్రొసీడింగ్‌ జారీ చేశారు. ఈ విషయాల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Next Story