సరి, బేసి విధానంలో పాఠశాలలు
By సుభాష్ Published on 2 Nov 2020 6:23 PM ISTదేశంలో కరోనా మహమ్మారి వల్ల అన్ని సంస్థలతో పాటు విద్యాసంస్థలు సైతం మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఏర్పడకుండా పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నాయి. అన్‌లాక్ 5.0లో భాగగా దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇక అసోంలో సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులకు సరి, బేసి విధానంలో పాఠాలు ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులునిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. సరి, బేసి విధానంలో తరగతులు ప్రారంభించి కోవిడ్ మరింతగా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
6,8,12 తరగతులు సోమ, బుధ, శుక్రవారాల్లో నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో 7,9,11 తరగతులు కొనసాగుతాయి. తరగతులు జరిగే రోజుల్లో విద్యార్థులంతా ఒకేసారి రాకుండా గ్రూపులుగా విభజించనున్నారు. కొన్ని గ్రూపులకు ఉదయం మరి కన్ని గ్రూపులకు మధ్యాహ్నం పాఠాలు చెప్పనున్నారు. అయితే ఎవరు ఎప్పుడొస్తానే విషయాన్ని ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు. తరగతులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని, మధ్యాహ్నం తరగతులు 12.30 నుంచి సాయంత్రం 3.30 వరకు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది.