రేపు తెలంగాణ రాష్ట్రంల్లో స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 8:33 AM GMT
రేపు తెలంగాణ రాష్ట్రంల్లో స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్‌..!

హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి. మాములుగా అయితే.. అక్టోబర్‌ 10 న స్కూళ్లు , కాలేజీలు రీ ఓపెన్ కావాల్సి ఉంది. అయితే..5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు బంద్‌కు దిగారు . దీంతో..సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 8 నే సెలవులు అయిపోవాలి. బంద్‌తో విద్యార్దులకు ట్రాన్స్‌ పోర్ట్ కష్టమవుతుందని ప్రభుత్వం సెలవులను పొడిగించింది.

ఇప్పటికే విద్యార్దుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు పొడిగించడంపై విద్యార్దులతోపాటు, పేరెంట్స్‌ ఆందోళనలో ఉన్నారు. అయితే..ఆర్టీసీ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలో తెరిస్తే విద్యార్దులు ఇబ్బందులు పాలవుతారని భావించింది. మరోవైపు..చాలామంది విద్యార్ధులు బస్ పాస్ లు ద్వారా స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటారు. బంద్‌ నేపథ్యంలో పాస్‌లు ఉన్నవారు ఇబ్బందులు పడే అవకాశముందని కూడా ప్రభుత్వం అనుకుని ఉండొచ్చు.

అయితే..ప్రస్తుతం బంద్ కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్‌ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. బస్ పాస్ ల విషయంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ..చెల్లుబాటు అయ్యేలా చూస్తారని తెలుస్తోంది. అయితే..రవాణ శాఖ మంత్రి, విద్యా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

Next Story