హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులతో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని డి.ఏ.వి. పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అమర్యాదకరంగా ప్రవర్తించిందంటూ ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థి తల్లి ఒకరు మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తూ వీడియోను తీశారు. ఎదురుగా ఛైర్ లో కూర్చున్న మహిళ ప్రిన్సిపాల్ రూమ్ లో కూర్చొని ఫోన్ లో వీడియో తీయడానికి ఎంత ధైర్యం అంటూ దబాయిస్తూ మాట్లాడింది. ఫోన్ చేసి మరో వ్యక్తిని పిలిపించింది. ఇంతలో ఆ విద్యార్థి తల్లి మాట్లాడుతూ ఉండగా ఫోన్ లాగేసుకోవడం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


ట్విట్టర్ లో తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ పలువురు పోస్టులు పెట్టారు. “Hello KTR garu @KTRTRS I hope you are doing good. I just want to bring this to your notice please see the conduct of DAV PUBLIC SCHOOL Kukatpally, Hyderabad, The principal & school staff have looted the parents. Please take necessary actions. Hoping for a positive response. (sic)”

కూకట్ పల్లి లోని డి.ఏ.వి. పబ్లిక్ స్కూల్ కు చెందిన ప్రిన్సిపాల్, స్టాఫ్ ఎలా అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారో చోడండి. తల్లిదండ్రులను ఎలా దోచుకుంటున్నారో చూడండి.. వీరిపై కేటీఆర్ గారు సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నానని అందులో పోస్టు చేశారు.

https://www.facebook.com/106168241141889/videos/1682303115251763/

MgmHydDailyNews అనే ఫేస్ బుక్ పేజీలో కూడా పోస్ట్ చేశారు.

నిజమెంత:

ఈ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన డి.ఏ.వి. పబ్లిక్ స్కూల్ కు చెందినది కాదు. జూన్ 26, 2020న  Opindia కు సంబంధించిన ఆర్టికల్ లో ఈ ఘటన పాట్నా లోని బిషప్ స్కాట్ గర్ల్స్ స్కూల్ కు చెందినది. పేరెంట్స్ ను డబ్బు కోసం పీక్కు తింటున్న  ఈ వీడియోపై బీహార్ ప్రైమరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ ఓ విచారణ కమిటీని వేసినట్లు Opindia ఆర్టికల్ లో తెలిపారు.

ట్విట్టర్ యూజర్ Anurag Srivatsa కూడా ఈ వీడియోను పోస్టు చేశాడు. ప్రశ్నిస్తున్న మహిళ ఫోన్ ను లాగేసుకుంటున్న వీడియోను అందులో చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియోను కూడా చూడొచ్చు. స్కూల్ వెబ్ సైట్ ను చూడగా చైర్ లో కూర్చున్న మహిళ ప్రిన్సిపాల్ కాదని తెలుస్తోంది. ఆమె స్కూల్ గార్డియన్ అని విశ్వాస్ న్యూస్ సంస్థ తెలిపింది.

https://www.vishvasnews.com/viral/fact-check-video-of-misbehave-with-female-guardian-is-not-from-hyderabad-but-from-patna-school/

కూకట్ పల్లికి చెందిన డి.ఏ.వి. పబ్లిక్ స్కూల్ అఫీషియల్ వెబ్ సైట్ ను చెక్ చేయగా అందులో ప్రిన్సిపల్ ఫోటోను చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న మహిళకు డి.ఏ.వి. స్కూల్ అఫీషియల్ వెబ్ సైట్ లో ఉన్న మహిళకు ఎటువంటి సంబంధం లేదు.

Dvp

వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన డి.ఏ.వి. పబ్లిక్ స్కూల్ కు చెందినది కాదు. పాట్నా లోని బిషప్ స్కాట్ గర్ల్స్ స్కూల్ కు చెందినది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet