లేడి టీచర్‌పై మనసుపడ్డ ప్రిన్సిపాల్.. ఆ విషయం దాచిపెట్టిమరీ..
By తోట వంశీ కుమార్ Published on 15 March 2020 5:41 AM GMTఓ స్కూల్ ప్రిన్సిపాల్.. తన దగ్గర పనిచేసే ఉపాధ్యాయురాలిపై మనసు పడ్డాడు. అతనికి ఆమెకు వయసులో 20 ఏళ్లు తేడా ఉన్నా.. ఆమెతో చనువుగా మెలిగేవాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి మరీ ఆ ఉపాధ్యాయురాలిని పెళ్లిచేసుకున్నాడు. చివరికి విషయం తెలియడంతో ఆ యువతి కుటుంబీకులు ఆ ప్రిన్సిపాల్‌కు బడితపూజ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ రహ్మత్‌నగర్ డిజివిజన్‌లోని కార్మికనగర్‌లో వెలుగుచూసింది.
హాబీబ్ ఫాతిమా నగర్‌లో నివసించే అయూబ్ అలీ(42) కార్మికనగర్‌లో ఓ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. అతడికి ఇప్పటికే వివాహమై పిల్లలున్నారు. అదే స్కూల్‌లో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి(23)పై కన్నేశాడు. ఆమెతో చనువుగా ఉంటూ స్నేహం పెంచుకున్నాడు. తనకు పెళ్లైన విషయం దాచిపెట్టి 10 రోజుల క్రితం ఆమెను రెండో వివాహాం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు శనివారం స్కూల్‌పై దాడి చేశారు. ఫర్నిచర్, కంప్యూటర్, పూలకుండీలను ధ్వంసం చేశారు. బాధితురాలు ప్రిన్సిపాల్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయూబ్ ఖాన్‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.