స్కూల్‌ బస్సులపై దాడులు.. 8 బస్సులు సీజ్‌.!

By అంజి  Published on  8 Feb 2020 11:20 AM GMT
స్కూల్‌ బస్సులపై దాడులు.. 8 బస్సులు సీజ్‌.!

హైదరాబాద్‌: నిబంధనలను పాతరవేస్తున్న స్కూల్‌ బస్సులపై రవాణాశాఖ అధికారులు దృష్టి సారించారు. నగర శివారు శంషాబాద్‌లో స్కూల్‌ బస్సులపై రవాణాశాఖ దాడులు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా రవాణాశాఖ అధికారులు.. స్కూల్‌ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తయ్యేవరకు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా డీటీసీ ప్రవీణ్‌రావు ఆదేశాల మేరకు.. శంషాబాద్‌లోని స్కూల్‌ బస్సులుపై అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని 8 బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. పరిమితికి మించి స్కూల్‌ బస్సుల్లో పిల్లలను రవాణా చేయడం, డ్రైవర్లు యూనిఫామ్‌ వేసుకోకపోవడం, ఫిట్‌నెస్‌, పర్మిట్లు లేకుండా నడుపుతున్న బస్సులను సీజ్‌ చేసిన అధికారులు ఆర్టీవో కార్యాలయానికి తరలించారు.

పలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. అయితే ఎప్పటికప్పుడు స్కూల్‌ బస్సులను తనిఖీలు చేస్తామని అధికారులు వెల్లడించారు. రవాణాశాఖ నిబంధనలు పాటించాలని స్కూల్‌ బస్సుల యాజమానులను రవాణాశాఖ అధికారులు హెచ్చరించారు. బ్రిలియంట్‌, ఒయాసిస్‌, శారదా, ఎస్‌ఆర్‌ డీజీ, రవీంద్ర భారతికి చెందిన 8 బస్సులను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.

Next Story