సూర్య గ్రహణం పై పండితులు ఏమంటున్నారంటే..!
By జ్యోత్స్న Published on 25 Dec 2019 8:42 AM ISTసూర్య గ్రహణం వివరణ:ఈ గ్రహణ ప్రభావం యావద్భారత దేశంలో ఉన్న వారందరిపైనా పడనున్నది. జాతక భాగం ప్రకారము, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వీటిని అనుసరించే వారికి శుభ ఫలితాలు వస్తాయి.
సూర్య గ్రహణం: తేదీ 26-12-2019, ఉదయం 8.08నిమిషాల నుండి ఉదయం 11.10 నిమిషాల వరకు
కేతుగ్రస్తమైన సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. ఆధ్యాత్మిక పురోగతిలో గ్రహణాలు అద్భుతమైన పర్వదినాలుగా పరిగణించబడుతాయి. అందులో కంకణాకార సంపూర్ణ సూర్య గ్రహణానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఈ గ్రహణం ధనుస్సు రాశి లో మూలా నక్షత్రం లో ఏర్పడును.
గ్రహణం సమయం సుమారు 3 గంటల 2 నిమిషాలు.
ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూడటం మంచి కాదు .
ముఖ్యముగా మూలా నక్షత్రం వారు ఈ గ్రహణం చూడవద్దు. అనారోగ్య హేతువు.
గ్రహణం ఏ రాశి లో సంభవిస్తుందో ఆ రాశి వారికి దోషం అని ధర్మ శాస్త్రం, అనారోగ్యము వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తున్నాయి. కనుక శాంతిప్రదమైన పరిహారములు చేసుకొనుట ఉత్తమం..
పరిహారములు 3 విధములుగా చేయవచ్చును.
ఉత్తమం, మధ్యమం, అధమం
ప్రధమం:(ఉత్తమం):
1). రాగి పాత్ర గాని , కంచు పాత్ర గాని, తీసుకుని బంగారంతో చేయించిన సూర్య బింబాన్ని , వెండితో చేయించిన నాగ సర్పాన్ని ఆ పాత్రలో పెట్టి ఆ పాత్రలో నిండుగా ఆవు నెయ్యి పోసి తెల్లని పంచెల చాపును 1¼ కేజీ నల్లని నువ్వులు సమంత్రకంగా వేదవిదులైన బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి..
గమనిక: ఈ దానం గ్రహణం విడిచిన తరువాతే చెయ్యాలి.. గ్రహణ సమయంలో చేయరాదు.
దాన సమయం లో చెప్ప వలసిన సంకల్పమ్:
ధనుస్సు రాశి వారు: మమ జన్మజాతక ధనుః రాశ్యాత్ తత్రాపి మూలా నక్షత్రే స్వజన్మ నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
వృషభ రాశివారు: మమ జన్మజాతక వృషభ రాశ్యాత్ అష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
కన్యా రాశి వారు: మమ జన్మజాతక కన్యా రాశ్యాత్ అర్థాష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
మకర రాశి వారు: మమ జన్మజాతక మకర రాశ్యాత్ ద్వాదశ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
ఆజ్య పూరిత కాంశ్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష సువర్న జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే
పై పరిహారం అవకాశం లేని వారు 2 వ పద్దతి :
2)మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం చేయవలెను
1¼ కేజీ ఉలవలు ,1¼ కేజీ గోధుమలు, తెల్లని పంచెల చాపు దానం చేయవలెను..
ఈ పరిహారం కూడా అవకాశం లేని వారు 3 వ పద్దతి పాటించాలి
3. శివ కవచ స్తోత్రం ప్రతి రోజు పారాయణ 3 నెలల పాటు చేయవలెను ..
గ్రహణ గోచారం:
ఉత్తమ ఫలితాలు : కర్కాటక , తుల,కుంభ, మీన రాశి వారికి శుభ ఫలితం ఉండును ...
మధ్యమ ఫలితాలు: మేషం, మిధునం, సింహం,వృశ్చికం రాశుల వారికి కొంచెం దోషం తో కూడిన మధ్యమ ఫలితం ఉండును
అధమ ఫలితం: వృషభ, కన్యా, ధనుస్సు, మకరం రాశి వారికి సంపూర్ణ దోష పూరిత అధమ ఫలితం సంభవించును .
ముఖ్యముగా ధనుస్సు రాశి వారికి దోషం అధికంగా ఉన్నది కావున పై పరిహారములు తప్పని సరిగా ఆచరించాలి.