దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గత నెలలో మినిమం బ్యాలెన్స్‌ ఉండాలనేదానిపై చార్జీలను ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో శుభవార్త వినిపించింది. ఏటీఎం విత్‌డ్రాయల్‌పై సర్వీస్‌ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐ ఏటీఎం కార్డులతో ఎన్నిసార్లు అయినా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.

అంతేకాదండోయ్‌.. ఎస్‌బీఐ, ఏటీఎంలే కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి కూడా ఎన్నిసార్లు అయినా విత్‌ డ్రా చేసుకోవచ్చు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వివరించింది. ఈ వెసులుబాటు జూన్‌ 30 వరకు వర్తించనున్నట్లు తెలిపింది.

సుభాష్

.

Next Story