కరోనా వైరస్‌: ఎస్‌బీఐ ఉద్యోగుల 100 కోట్ల విరాళం

By సుభాష్  Published on  1 April 2020 1:33 PM GMT
కరోనా వైరస్‌: ఎస్‌బీఐ ఉద్యోగుల 100 కోట్ల విరాళం

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక మన దేశంలో కూడా ఉగ్రరూపం దాల్చింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు. రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా నివారణకు ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ‘పీఎం కేర్స్‌ ఫండ్‌’ కు ఎంతో మంది విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్‌ వ్యవస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగుల తరపున 'పీఎం కేర్స్‌ ఫండ్‌'కు రూ. 100 కోట్ల విరాళం ప్రకటిస్తున్నామని బ్యాంకు చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ ప్రకటించారు. కాగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాకింగ్‌ సెక్టార్‌లో అగ్రస్థానంలో ఉందని, బ్యాంకు తరపున పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల జీతాన్ని మొత్తం వంద కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వార్షిక లాభంలో 0.25 శాతం సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ) కార్యక్రమాల కింద కోవిడ్‌ -19 నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా కేటాయించినట్లు చెప్పారు. ఇలా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారస్తులు ఎంతో మంది విరాళలు అందజేస్తున్నారు. అలాగే ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా భారీ విరాళాలు సమకూరాయి.

Next Story