ఎస్‌బీఐ 'డెబిట్' కార్డులు ఇక పని చేయవు
By Newsmeter.Network
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాకిచ్చింది. ఎస్‌బీఐ మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని మరోమారు స్పష్టం చేసింది. ఇప్పటికీ కూడా మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని, వీలైనంత త్వరగా డెబిట్ కార్డులను మార్చుకోవాలని సూచించింది. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం.. మేం ఇప్పటికే మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత కార్డులతో ఉన్న కార్డులను అందించామని, మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులతో ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయని అభిప్రాయపడింది. అందుకే ఈ కార్డులను డిసెంబర్ 31 తర్వాత డీయాక్టివేట్ చేస్తామని వెల్లడించింది ఎస్‌బీఐ. డిసెంబర్ 31వ తేది తర్వాత మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులు పని చేయవని పేర్కొంది. ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి కస్టమర్లు ఆయా బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ కూడా చేసింది. కొత్త ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత ఎస్‌బీఐ డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. ఈ కార్డుల వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్డులు మార్చుకోవాలని ఇప్పటికే ఎన్నో సార్లు సూచించడం జరిగిందని, కార్డులను మార్చుకోని వారికి ఇక ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొంది.
కొత్త కార్డు కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు:
స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగానే పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డును పొందొచ్చని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ‘కస్టమర్లు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే కొత్త డెబిట్ కార్డును సులభంగా పొందొచ్చు. ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పని పూర్తిచేసుకోవచ్చని వివరించింది.
ఎస్‌బీఐ కస్టమర్లకు కొన్ని సూచనలు:
కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఎస్‌బీఐ కస్టమర్లు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని సూచించింది. అవేమిటంటే... బ్యాంకు అకౌంట్ కరెంట్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలని, కొత్త ఈఎంవీ చిప్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్న అడ్రస్‌కే వెళ్లిపోతుందని పేర్కొంది. అందువల్ల అడ్రస్ మారి ఉంటే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది ఎస్‌బీఐ.