శాటిలైట్ చిత్రాలు చెప్పిన నిజం..ఊసూరుమంటోన్న ఉస్మాన్ సాగర్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 11:34 AM GMT
శాటిలైట్ చిత్రాలు చెప్పిన నిజం..ఊసూరుమంటోన్న ఉస్మాన్ సాగర్..!

హైదరాబాద్: ఒక పక్క మునుపెన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాని..ఉస్మాన్‌ సాగర్‌లోకి చేరాల్సిన నీరు మాత్రం చేరడంలేదు. ఏడాదికి ఏడాదికి ఉస్మాన్ సాగర్‌లోకి చేరాల్సిన నీరు తగ్గిపోతుంది. 9 అక్టోబర్, 2018 .. అక్టోబర్ 10, 2019 మధ్య తీసిన శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఉస్మాన్‌ సాగర్‌లోకి ప్రవాహం ఎందుకు తగ్గింది అనేదానిపై ప్రభుత్వం పరిశోధించాల్సిన అవసరముంది.

ఉస్మాన్ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి హైదరాబాద్‌కు 88 మిలియన్ లీటర్ల నీటి సరఫరా అవుతుంది. సెప్టెంబర్ 2019 ఉంది హైదరాబాద్, సిటీ చుట్టపక్కల మంచి వానలు పడుతున్నాయి. అయినా..ఇప్పటి వరకు 77 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే ఉస్మాన్ సాగర్‌ నుంచి బయటకు వస్తుంది.

ఉస్మాన్ సాగనర్‌లోకి నీరు శంకర్ పల్లి, చిలుకూరు, వికారాబాద్, ఖానపూర్‌, హిమాయత్ నగర్‌ పరివహాక ప్రాంతాల నుంచి రిజర్వాయర్‌లోకి వస్తుంది. ఈ పరివాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురి కావడంతో ఉస్మాన్ సాగర్‌లోకి నీరు రావడం తగ్గిందంటున్నారు అధికారులు. అయితే..ఆక్రమణలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగు నీటి బోర్డ్ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేకపోయాయని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు.



అంతా ఓకే:టెక్నీకల్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్

"అక్టోబర్ నుంచి ప్రతిరోజు 77 ఎం ఎల్ నీటిని అందిస్తున్నామన్నారు. గత నెలలో 88 ఎంఎల్ అందించామన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మెరుగ్గా ఉందన్నారు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలలో కొన్ని చోట్ల వర్షాలు పడినా మరికొన్ని ప్రాంతాలలో వర్షాలు లేవు. అయితే హైదరాబాద్ లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో సగటు వర్షపాతం గత ఏడాదితో పోల్చితే ఎక్కువే అంటూ" న్యూస్ మీటర్‌కు చెప్పారు టెక్నికల్ డైరెక్టర్ వీ.ఎల్ ప్రవీణ్ కుమార్ .

"రిజర్వాయర్ చుట్టూ పక్కల ఆక్రమణలు జరిగివుంటే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతాలు మునిగిపోయి ఉండేదన్నారు. అలాంటి ఘటనలు తమ దృష్టికి రాలేదన్నారు. రుతుపవనాలు రాకముందే రిజర్వాయర్ లోకి నీళ్లు చేరే అన్ని ఛానెళ్లను క్లియర్ చేశామన్నారు. సాగర్ చుట్టూ ఎలాంటి ఆక్రమణలు జరగలేదన్నారు" ప్రవీణ్ కుమార్

వరదలు నుంచి కాపాడానికి ఉస్మాన్, హిమాయత్ సాగర్ లు

హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడి, నగరానికి నీటిని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. 1920 - 1927 లో ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో నిజామ్ లు నిర్మించారు. 20 ఏళ్ల క్రితం వరకు రిజర్వాయర్‌ లోని నీటిని నగరానికి సమృద్దిగానే అందించారు. అయితే అక్రమ కడ్డడాలతో ఆక్రమణలకు గురవుతూ సాగర్ తీరం కుచించుకు పోయింది. ధీంతో నీటి ప్రవాహ ఛానెళ్లు దెబ్బతిని రిజర్వాయర్‌లోకి నీరు రావడం తగ్గిందనే విమర్శలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అంగీకరించడం లేదు.



జీవో111 ఉల్లంఘన: పర్యావరణ ప్రేమికుడు

ఉస్మాన్‌ సాగర్ పరీవాహక ప్రాంతం 15వేల చ. కి విస్తరించి ఉంది. గండిపేట్ కు 8 వ కి.మీ.ల దూరంలో ఉంది. తాను ఉంటున్న ప్రాంతంలో 3 సెం మీల వర్షపాతం నమోదైనా జలాశయంలోకి తగినంత వరద నీరు చేరలేదని పర్యావరణ ప్రేమికుడు ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ అన్నారు. జీవో 111 ఉల్లంఘనలకు సంబంధించి 2016 లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా సంప్రదించామన్నారు. సాగర్ చుట్టూ ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలను ప్రజలు నిర్మిస్తుండడంతో నీటి మార్గాలు, కాలువలు మళ్లించబడి సాగర్‌ కుంచించుకు పోతుందని ఆరోపించారు.

Osmansagar 2018

హైదరాబాద్‌లోని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (ఎస్ఓయూఎల్) కన్వీనర్ డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ... " రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 66% అధికంగా నమోదైందని తెలిపారు. ఉస్మాన్‌సాగర్ లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటి మూలంగా ఇన్‌ఫ్లో ఛానెళ్లు అన్నీ నిరోధించబడ్డాయని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే జీఓ 111 ను రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీంతో మీ భూముల ధరలకు రెక్కలొస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారన్నారు. ఈ మాటలతో పాలకులకు ఉస్మాన్ సాగర్‌ కు మంచి చేయాలనే ఉద్దేశంలేదని ఆర్ధమవుతుందన్నారు.

3వేల నీటి కుంటలు, 7వేల సరస్సులు

3వేలనీటి కుంటలు, 7వేల సరస్సులతో అంతర్గతంగా ఒకదానితో మరొకటి లింక్‌గా ఉండేవి. ఉస్మాన్ సా గర్ కేవలం 70 సరస్సులతో మాత్రమే లింక్‌లు ఉన్నట్లు తేలింది. జీఓ 111 ని నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగంగా నీటి సరఫరా అధికారులు ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలను అందిస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు.

Osmansagar 2019

జీవో 111 ఏం చెబుతోంది... ?

ఉస్మాన్ సాగర్ , హిమాయాత్ సాగర్ రిజర్వాయర్ లను పరిరక్షించేందుకు ఉమ్యడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో మొదటి సారిగా జీవో 111ను విడుదల చేసింది. దీని ప్రకారం రిజర్వాయర్ల చుట్టూ 10 కిలోమీటర్ల లోపు ఎలాంటి కడ్డదాలు , నిర్మాణాలు చేపట్టొద్దని ఆ జీవోలో పేర్కొంది.

“ కృష్ణా, గోదావరి నుంచి లీటరు నీరు రూ. 7లకు కొంటున్నారు. కోట్ల డబ్బు పెట్టుబడి పెట్టి రెండు ఆనకట్టలు కూడా నిర్మించారు. అధికారులు నేరుగా ఈ నీటిని జంట జలాశయాలలోకి ఎందుకు పంపించలేక పోతున్నారని ప్రశ్నిచారు పర్యావరణ ప్రేమికుడు రాజ్ కుమార్. ఎందుకంటే జలాశయాలు నిండితే ఈ ప్రాంతంలో చాలా ఆక్రమణలు మునిగిపోతాయన్నారు. జీవో 111 లో ఉన్నప్పటికీ, ఉస్మాన్ , హిమాయత్ సాగర్ ల పరీవాహక ప్రాంతాలలో ఇప్పటికీ ఆక్రమణలు జరుగుతున్నాయని రాజ్ కుమార్ ఆరోపించారు.

భూములు రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్మాలనే ప్లానా..?

రింగ్ రోడ్ నుండి మీరు శంషాబాద్ విమానాశ్రయం వైపు ప్రయాణిస్తే, నిర్మాణంలో ఉన్న అనేక భవనాలను చూస్తారు. ఉస్మాన్ సాగర్ చుట్టూ 84 గ్రామాలు ఉన్నాయి. రిజర్వాయర్ మరింత ఎండిపోతే, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు రావచ్చు. రిజర్వాయర్ నిండితే ప్రయోజనం పొందే రైతులు, మత్స్య సంఘాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్లను ఎండ గట్టి చుట్టూ ఉన్న భూమిని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్మాలని ప్రభుత్వం యోచిస్తోందని రాజ్ కుమార్ ఆరోపించారు.

సరస్సులను కాపాడుకోవాలి

తగినంత వర్షపాతం లేదని ప్రభుత్వం చేసిన వాదనను అంగీకరిస్తూ ..క్షేత్ర స్థాయిలో మరింతగా లోతైన అధ్యయనాలు అవసరమని అర్బన్ స్టడీస్ (సీ ఈ ఎస్ ఎస్) ప్రొఫెసర్ డాక్టర్ సి రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. విస్తారమైన వర్షాన్ని పరిశీలిస్తే, ఈ సమయానికి జలాశయాలు నిండి ఉండాలి. ఏదేమైనా జంట జలాశయాలకు నీటిని తీసుకువచ్చే ఇన్‌ఫ్లో చానెల్స్ అక్రమ నిర్మాణాల ద్వారా ఆక్రమించబడిందనేది అందరికీ తెలిసిన వాస్తవం. వర్షపు నీరు మొదట పరీవాహక ప్రాంతాలలో, పొలాలలోని చెరువులలోని ప్రవహించి ట్యాంకులను నింపాలి. ప్రస్తుత పరిస్థితుల్లో జంట రిజర్వాయర్లలను పూర్తి స్థాయి నీటి సామర్ధ్యానికి తీసుకురాడం కష్టతరం.

రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. నీటి వనరులను రక్షించడానికి ఆక్రమణలను ఆపాలి. 1930 నుంచి ప్రభుత్వం హైదరాబాద్‌ లో ఒక్క సరస్సునూ పునరుద్ధరించలేదు. హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడటానికి ఉస్మాన్‌సాగర్ నిర్మించబడింది. 1908 నాటి వరదల్లా మళ్లీ జరగవని ఎటువంటి హామీ ఇవ్వలేము. ఇలాంటి దుర్ఘటన పునరావృతమైతే హైదరాబాద్ మొత్తం నీట మునుగుతుందని, ప్రజలు చనిపోతారని, వారి ఆస్తులు దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story