'సరిలేరు నీకెవ్వరు' వినూత్న తరహా టీజర్ కాన్సెప్ట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Nov 2019 6:05 AM GMT
సరిలేరు నీకెవ్వరు వినూత్న తరహా టీజర్ కాన్సెప్ట్..!

సూపర్‌స్టార్‌ మహేష్‌ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ గా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను 22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

ఎకె ఎంటర్టైన్మెంట్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక అన్‌లాక్ ఫీచర్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ను నవంబర్ 19న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.. ఈ కొత్త కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికీ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా టీజర్ డేట్, టైమ్ ను రీవీల్ చేయడానికి ట్విట్టర్ లో అనుసరించిన కొత్త తరహా కాన్సెప్ట్ సూపర్ స్టార్ అభిమానులను థ్రిల్ చేసింది. ఈ తరహా నూతన ప్రయత్నం తో టీజర్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్ లో మొట్ట మొదటి సారి చేసిన ఈ తరహా ప్రయోగం తో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ తమ ప్రమోషన్స్ నీ ఘనంగా ప్రారంభించింది.

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉండడంతో ఇదే జోష్, ఎనర్జీతో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషనల్ టీమ్ రాబోయే వారాల్లో, చిత్రం విడుదలకు ముందే మరెన్నో వినూత్న ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. అందరు ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ నవంబర్ 22న సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Next Story