ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఓ దారిక వచ్చాయి. శివసేనకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌, ఎన్సీపీ అంగీకరించాయి. కామన్‌ మినిమం ప్రోగ్రాంకు మూడు పార్టీలు అంగీకరించాయి. కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి, ఎన్సీపీ కామన్ మినిమం ప్రోగ్రాం చైర్మన్ పదవి దక్కనున్నాయి.

ఈ సందర్భంగా శివసేన ఫైరక బ్రాండ్ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిశామన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీల పాలనా అనుభవంతో ముందుకు వెళ్తామన్నారు. పదవుల పంపకం గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఐదేళ్లు కాదు..25 ఏళ్లు సీఎంగా శివసేన ఉంటుందన్నారు. ఉద్దవ్ థాక్రే నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అని చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.