కన్న కూతురి గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి..!
By సుభాష్ Published on 1 May 2020 5:11 PM IST
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుల్కల్ మండలం గొంగులూరు తండాలో కన్న కూతురి గొంతుకోసి దారుణంగా చంపేశాడు ఓ కసాయి తండ్రి. రమావత్ జీవన్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా మనస్థాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న నాలుగు సంవత్సరాల చిన్నారి అవంతిక గొంతు కోసి హతమార్చాడు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు సరైన తిండి లేక నానా అవస్థలకు గురవుతున్నారు. సరైన ఉపాధి లేక తినేందుకు తిండి లేక కొందరు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.
Next Story