ముహూర్తానికి ముందు పెళ్లికుమారుడు ఆత్మహత్య
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:11 PM ISTబషీరాబాద్: మేడ్చల్‌లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సందీప్ అనే పెళ్లికుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా పెళ్లి ముహూర్తానికి ముందు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
అయితే పెళ్లికి ముందు సందీప్ ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో..బంధువులంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సందీప్ ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story