సైకత శిల్పికి అంతర్జాతీయ గౌరవం..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Nov 2019 11:28 AM ISTప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ అంటే పరిచయం చేయాల్సిన పనిలేదు. శిలలను శిల్పాలుగా మార్చి ఘనతకెక్కిన ఎందరో శిల్పులకన్నా భిన్నంగా ఈయన సముద్రపు ఒడ్డును, ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చి... సందర్శకుల ప్రశంసలతో పాటు... గతంలో భారత రాష్టప్రతి పురస్కారాన్ని కూడా అందుకున్న ప్రముఖ సైకత శిల్పి. ఇప్పుడు అతనికి మరొక అద్భుతమైన గౌరవం లభించింది. ఇటాలియన్ గోల్డెన్ సాండ్ అవార్డ్స్ 2019 అవార్డు దక్కింది. గత వారం ఇటలీలోని లెస్సి ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైతక శిల్పాల పోటీలో సుదర్శన్ పట్నాయక్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 10 అడుగుల ఎత్తైన మహాత్ముని సైతక శిల్పాన్ని రూపొందించి వీక్షకులను అబ్బుర పరిచారు.
శుక్రవారం రోమ్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ఉత్సవంలో సుదర్శన్ పట్నాయక్ అవార్డును పొందారు. భారత రాయబారి ప్రతినిధిగా, మిషన్ డిప్యూటీ చీఫ్ నిహారిక సింగ్ పాల్గొన్నారు. సైతక శిల్పాల కోసం నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఎనిమిది మంది సైతక శిల్పులు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా సమాజానికి దేశం పట్ల ప్రేమ, త్యాగం వంటి సందేశాలను ఇవ్వడమే తన లక్ష్యమని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
ఇది కూడా చదవండి: స్వచ్ఛమైన ఆక్సిజన్ ₹299 లకే